ఆ రీమేక్ లో నటించడం లేదంటున్న యంగ్ హీరో !

Published on Apr 11, 2019 12:30 am IST


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. రొమాంటిక్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 12న విడుదలకానుంది. వరస పరాజయాలతో ఇబ్బందుల్లో వున్న సాయి ధరమ్ ఈ చిత్రం ఫై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఇక ఇదిలాఉంటే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘గల్లీ బాయ్’ తెలుగు రీమేక్ లో తేజు నటించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై తేజు క్లారిటీ ఇచ్చాడు. నేను ఆ సినిమా ఇప్పటివరకు చూడలేదని దాన్ని రీమేక్ చేసే ఆలోచన కూడా లేదని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో ఆయన స్పష్టం చేశాడు.

సంబంధిత సమాచారం :