“అశ్వద్ధామ” అనే పౌరాణిక టైటిల్ తో రానున్న యంగ్ హీరో

“అశ్వద్ధామ” అనే పౌరాణిక టైటిల్ తో రానున్న యంగ్ హీరో

Published on Jun 4, 2019 3:07 AM IST

హీరో నాగ శౌర్య రష్మిక మందాన తో కలిసి చేసిన “ఛలో”మూవీ అతనికి ఓ మంచి విజయాన్ని అందించింది. తరువాత ఆయన చేసిన “కణం”,”అమ్మమ్మ గారిల్లు” “నర్తనశాల” చిత్రాలలో ఏది కూడా ఆశించినంత విజయం అందించలేదు. తాజాగా నాగ శౌర్య నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘అశ్వద్ధామ’ అనే టైటిల్ ను ఖరారుచేయనున్నట్లు సమాచారం. ఈ టైటిల్ ను ఆయన రిజిస్టర్ కూడా చేయించడంతో ఈ టైటిల్ నే ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.

నూతన దర్శకుడు రమణ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో, నాగశౌర్య కి జంటగా మెహ్రీన్ నటిస్తోంది. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. త్వరలోనే ఫస్ట్‌లుక్ ను రిలీజ్ చేయనున్నారట.మరో వైపు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వస్తున్న ప్రయోగాత్మక చిత్రం లో హీరోగా నాగ శౌర్య నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు