వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ !


‘భలేమంచిరోజు’ ఫేమ్ శ్రీ రామ్ ఆదిత్య తాజాగా మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. యంగ్ హీరోలు సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల్లో ఇంతమంది హీరోలను పెట్టి మల్టీ స్టారర్ అంటే కథ ఎలా ఉంటుందో అనే ఆసక్తి మొదలైంది. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ కథను నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించాడట.

అందుకే ఈ కథ చాలా ప్రత్యేకంగా, కొత్తదిగా ఉంటుందని అంటున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘శమంతకమణి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా నిర్ణయించారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ మార్చి మొదటి వారం నుండి మొదలుకానుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్లు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.