పొలిటికల్ థ్రిల్లర్ లో యంగ్ హీరో !

Published on Apr 15, 2019 1:23 pm IST

ఇటీవల అరవింద సమేత లో కీలక పాత్రలో నటించిన యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రస్తుతం కోలీవుడ్ లో ధనుష్ నటిస్తున్న చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా నవీన్ సోలో హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఈ రోజు లాంచ్ అయ్యింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వెంకటాపురం ఫేమ్ వేణు మాదికంటి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అచ్చు సంగీతం అందించనున్నాడు.

యాషస్ సినిమాస్ బ్యానర్ ఫై మంజునాథ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రం తోపాటు నవీన్ హీరోగా తెలుగులో 28డిగ్రీస్ సెంటీగ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :