రేపే నాగ చైతన్య ‘మజ్నూ’ ప్రారంభం!

రేపే నాగ చైతన్య ‘మజ్నూ’ ప్రారంభం!

Published on Nov 17, 2015 5:26 PM IST

Naga-Chaitanya
మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులో అక్కినేని నాగ చైతన్య మజ్నూ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రేమకథలతో ఇప్పటికే యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన చైతూ ఈ సినిమా తనకు మరింత పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ మీనన్‌తో చేస్తోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ను చివరిదశకు చేర్చేసిన చైతూ, అప్పుడే మజ్నూను కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయారు.

కార్తికేయతో సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి మజ్నూ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసిన టీమ్, రేపు సినిమాను అధికారికంగా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసింది. హైద్రాబాద్‌లో రేపు పూజా కార్యక్రమాలతో మజ్నూ సినిమా లాంచ్ కానుంది. డిసెంబర్ నెల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య సరసన అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్ ఇద్దరు హీరోయిన్లుగా ఎంపిక కాగా మూడో హీరోయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. హరిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు