పోటీ పడుతున్న మెగాస్టార్ అల్లుళ్లు !
Published on Jun 15, 2018 5:30 pm IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తమ సినిమాలతో పోటీపడబోతున్నారు. కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’, కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న ‘విజేత’ ఈ రెండు చిత్రాలు ఒకే రోజున అంటే జులై 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తేజ్ సినిమా వైపు నుండి కరుణాకరన్ కు జులై 6 సెంటిమెంట్ అట, ‘విజేత’ చిత్రం వైపు నుండి సాయి కొర్రపాటికి కూడ జులై 6 సెంటిమెంట్ అట, అందుకే ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల అయి పోటీపడబోతున్నాయి.

గతకొంతకాలంగా వరుస ప్లాప్ లతో సతమతవుతున్న సాయి ధరమ్ తేజ్ కెరీర్ నిలబడాలి అంటే ఈ ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రమే కీలకం కానుంది. అలాగే ఇప్పుడిప్పుడే కెరీర్ ను మొదలు పెడుతున్న కళ్యాణ్ దేవ్ క్కూడా ఈ ‘విజేత’ చిత్రం విజయం సాధిస్తేనే అతనికి స్టార్ స్టేటస్ వస్తుంది. మరి ఈ పోటీలో ఏ మెగా అల్లుడు గెలుస్తాడో చూడాలి.

  • 4
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook