మరో మైల్ స్టోన్ కు దగ్గరగా రెబల్ స్టార్.!

Published on Sep 26, 2020 2:02 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇపుడు మన తెలుగు రాష్ట్రాలను దాటి జాతీయ స్థాయిలో కూడా ఏ రేంజ్ లో నెలకొనబడిందో అందరికీ తెలిసిందే. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాకుండా మన డార్లింగ్ హీరో ప్రభాస్ క్రేజ్ సోషల్ మీడియాలో కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పాలి. తాను ఉన్నదే పేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ సామాజిక మాధ్యమాల్లో వాటిట్లోనే ఈ మధ్య 25 మిలియన్ మార్కును అందుకున్నారు.

అయితే ఇపుడు పేస్ బుక్ ఫాలోవర్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఒక మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేయనున్నాడు. ఆ మధ్య కాలంలో కేవలం రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సాధించిన రెబల్ ఇప్పుడు కొన్ని వేల మంది ఫాలోవర్స్ గ్యాప్ తో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కు కొద్ది దూరంలో ఉన్నారు. ఈ

ఫీట్ ఎప్పుడు టచ్ అవుతుందా అని రెబల్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. అతి తొందరలోనే ప్రభాస్ ఈ మైల్ స్టోన్ ను టచ్ చెయ్యడం ఖాయం అని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ మొత్తం మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో “రాధే శ్యామ్” షూట్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :

More