చెర్రీ సినిమాలో ‘రఘువరన్ బీటెక్’ విలన్!

చెర్రీ సినిమాలో ‘రఘువరన్ బీటెక్’ విలన్!

Published on Jun 15, 2015 8:28 AM IST

Amitash-Pradhan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అనౌన్స్ అయిన రోజునుంచే ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. గతంలో శ్రీనువైట్లతో కలిసి సూపర్ హిట్ సినిమాలకు రచయితలుగా పనిచేసిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు కొంత బ్రేక్ తర్వాత శ్రీనువైట్లతో చేస్తున్న సినిమా ఇదే! డీవీవీ దానయ్య చాలా రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతోంది.

ఇక ఇప్పటికే భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తాజాగా ఓ కీలక పాత్ర కోసం తమిళ నటుడిని ఎంపిక చేశారు. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలో విలన్ రోల్ చేసిన అమితాష్ ప్రధాన్‌ను చెర్రీ సినిమాలో ఓ పాత్రకు ఎంపిక చేశారు. రఘువరన్ బీటేక్‌లో ఓ రిచ్ బిజినెస్‍మేన్‌గా అమితాష్ మంచి ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ఈనెల 18నుంచి అమితాష్ జాయిన్ అవుతారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా అందరినీ అలరించేలా ఉండనుందని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు