అభిమానులకు ప్రేమతో తారక్.!

అభిమానులకు ప్రేమతో తారక్.!

Published on May 20, 2020 6:19 PM IST

ఒక్క సారి ఓ వ్యక్తిపై అభిమానం మొదలయితే అది ప్రేమగా మారి వెలకట్టలేని విధంగా రూపాంతరం చెందుతుంది. అలాంటి ప్రేమను అందించే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న చలన చిత్ర పరిశ్రమ కథానాయకులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రనైనా డైలాగ్ నైనా ఎంతో ఈజ్ గా పెర్ఫామ్ చెయ్యగలిగే నటుడు తారక్.

డెడికేషన్ కు అద్దం పట్టేలా తనను తాను నిరంతరం కష్టపెట్టుకొని మెప్పించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు నేడు కావడంతో తారా స్థాయి అభిమానం చూపించి పండుగలా తారక్ అభిమానులు జరుపుతున్నారు. దీనితో ఇంత ప్రేమను చూపిస్తున్న అభిమానులకు తారక్ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ పెట్టారు.

“మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప..” అంటూ తనపై ఎంతో ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ప్రేమతో తన స్పందనను తెలిపారు. దీనితో తారక్ అభిమానులు ఈ ట్వీట్ తో మరింత ఆనందంలో మునిగి తేలుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు