టాలీవుడ్ ని దుమ్ముదులుపుతున్న యువ హీరోలు

TFI
టాలీవుడ్ లో ప్రస్తుతం యువహీరోల హవా నడుస్తుంది. స్టార్ హీరోల కోసమే కధలు ప్రిపేర్ చేస్తూ ఎదురుచూడకుండా యువహీరోల కోసం క్యూలు కట్టడం విశేషం. గతంలో చిన్న బడ్జెట్ సినిమాలంటే చులకన స్వభావం వున్నా క్రమంగా అది తగ్గుముఖం పట్టింది.

యువహీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలకోసం చర్చించుకోవడం ప్రస్తుత ట్రెండ్. నారా రోహిత్, శర్వానంద్, నాని, నిఖిల్, సుధీర్ బాబు వంటి తారలు ఈ జాబితాలోకే చేరుతారు. సరికొత్త కధా కధానాలతో ఈ యువహీరోలు చేతిననిండా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి వీరందరికీ కొంత సమయం పట్టినా ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఖాతాలో మంచి హిట్స్ వుండడం ఆనందకరం. స్క్రిప్ట్ ల ఎంపికలో , సినిమాల క్వాలిటీ విషయంలో రాజీపడకుండా వీరంతా ఇండస్ట్రీని మరో ఎత్తుకి తీసుకెళ్లాలని కోరుకుందాం.

Exit mobile version