సూర్యకి గట్టిపోటీ ఇవ్వనున్న యువహీరోలు

సూర్యకి గట్టిపోటీ ఇవ్వనున్న యువహీరోలు

Published on May 26, 2015 3:27 AM IST

Suriya
మిగిలున్న వేసవి సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి దాదాపు సినీ ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. వచ్చే రెండు వారాలలో యువ నటులు నటించిన పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నాయి. వీరితోపాటు తమిళనటుడు సూర్య సైతం పోటీలో వుండడం ఆసక్తికరం. ఎప్పుడూ పండగ సీజన్లలో పెద్ద హీరోలతో ఈసారి యువహీరోల దగ్గర తన క్రేజ్ చూపించానున్నాడు.

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘పండగ చేస్కో’ ఈ నెల 29న విడుదలకు సిద్దమవుతుంది. నాగాశౌర్య నటించిన ‘జాదుగాడు’, సంపూర్ణేష్ బాబు ‘సింగం 123’, నారా రోహిత్ ‘అసుర’, ఆకాష్ పూరి ఎంట్రీ ‘ఆంధ్రాపోరి’ సినిమాలు సూర్య ‘రాక్షసుడు’తోపాటు విడుదలకానున్నాయి.

సెన్సార్ పూర్తిచేసుకున్న పండగ చేస్కో సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. రాక్షసుడు సినిమాకు ఇది గట్టి పోటీగా నిలుస్తుందని అభిప్రాయం. మిగిలిన చిత్రాలు జూన్ 5న విడుదలయ్యే సూచనలు వున్నాయి. తాము ఎదుర్కుంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ నుండి బయటపడితే ఈ జాబోతాలోకి సందీప్ కిషన్ ‘టైగర్’ కూడా జతకలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు