వైఎస్ జగన్ చేతులమీదుగా విడుదలైన సుమంత్ కొత్త సినిమా టీజర్ !

వైఎస్ జగన్ చేతులమీదుగా విడుదలైన సుమంత్ కొత్త సినిమా టీజర్ !

Published on Aug 21, 2018 11:27 PM IST

‘మళ్ళీ రావా’ చిత్రం తో మంచి విజయాన్నిసాధించిన హీరో సుమంత్ తాజాగా ‘ఇదం జగత్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదలచేశారు. ఇక చినప్పటినుండి సుమంత్, వైఎస్ జగన్ ఇద్దరు మంచి మిత్రులు.

నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అంజు కురియన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈచిత్రానికి ‘గూఢచారి’ ఫెమ్ శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. జొన్నలగడ్డ పద్మావతీ, శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు