యాత్ర నుండి విజయమ్మ లుక్ విడుదల !

Published on Jan 7, 2019 2:39 pm IST


వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నచిత్రం యాత్ర. ఈసినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర యూనిట్. అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈ రోజు సాయత్రం 5గంటలకు విడుదలచేయనుండగా తాజాగా ఈ చిత్రంనుండి విజయమ్మ లుక్ ను విడుదలచేశారు. ఈ సినిమాలో సపోర్టింగ్ యాక్టర్ ఆశ్రిత వేముగంటి విజయమ్మ పాత్రలో నటిస్తుంది. ఇక ఆమె లుక్ ఆ పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యింది.

మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా జగపతి బాబు , పోసాని కృష్ణ మురళి , సుహాసిని , అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :