విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న అల్లు శిరీష్ ‘యుద్ధ భూమి’ !

విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న అల్లు శిరీష్ ‘యుద్ధ భూమి’ !

Published on Jun 19, 2018 10:41 AM IST

మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ‘1971: బియాండ్ బోర్డర్స్’ చిత్రంతో గత సంవత్సరం మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో మ‌ల‌యాళం స్టార్ ‘మోహ‌న్ లాల్‌’ మేజ‌ర్‌గా నటించగా అల్లు శిరీష్ సోల్జర్ గా నటించారు. ఈ చిత్ర తెలుగు అనువాదం ‘యుద్ధభూమి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కొన్ని వాస్తవ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. గ‌త ఏడాది మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రం విజయవంతమైంది.

అయితే తెలుగులో జూన్ 22న విడుదల కావాల్సిన ‘యుద్ధభూమి’ చిత్రం కొన్ని కారణాలు వల్ల వాయిదాపడి జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఈ యన సినిమాలన్నీ ఆర్మీ నేపధ్యంలోనే ఉంటాయి. సిద్ధార్ద్ విపిన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్, శ్రీ ల‌క్ష్మీ జ్యోతి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై ఏయ‌న్ బాలాజీ తెలుగులోకి అనువదించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు