రజనితో ‘యువరాజ్ సింగ్ తండ్రి’ ఫైట్ !

రజనితో ‘యువరాజ్ సింగ్ తండ్రి’ ఫైట్ !

Published on Jul 4, 2019 7:00 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమాలో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ‘యోగ్‌ రాజ్ సింగ్’ నటిసున్నారు. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ భారీ యాక్షన్ సన్నివేశంలో యోగ్‌ రాజ్, రజినితో కలిసి ఫైట్ చేయనున్నారట. ఇప్పటికే ఆ సన్నివేశాలను షూట్ చేశారు.

ఇక యోగ్‌రాజ్ కూడా క్రికెటరే.. క్రికెట్ కెరీర్ ముగించాక సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన యోగ్‌రాజ్ సింగ్ చాలా సినిమాల్లోనే నటించారు. రజని గత చిత్రం ‘పేట’లో కనిపించినట్టే ఈ చిత్రంలో కూడా ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరొక నటి నివేత థామస్ సైతం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు