శరీరంలోని అణువుణువు బాధ పడుతుంది – ప్రముఖ దర్శకుడు

Published on Aug 29, 2018 12:00 pm IST

నందమూరి హరికృష్ణగారి మరణంతో సినీపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన ఆకస్మిక మరణవార్త ప్రతి ఒక్కరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. తమ అభిమాన నాయకుడు, నటుడు దుర్మరణం చెందారని తెలిసి ఆయనకి అత్యంత సన్నిహితులు భోరున విలపిస్తున్నారు. ఇప్పటికే యావత్తు సినీపరిశ్రమ ఆయన మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతుంది.

కాగా హరికృష్ణగారికి అత్యంత ఆప్తుడు ఆయనతో సినిమాలను తీసిన దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి, హరికృష్ణగారు ఇక లేరన్న వార్తని ఆ బాధని ఓ కవిత రూపంలో వ్యక్తపరుస్తూ తన సంతాపాన్ని తెలిపారు. అలాగే పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తన సంతాపాన్ని తెలుపుతూ నా ప్రియతమ సోదరులకు వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు..శ్రీ హరిక్రిష్ణ గారి దివ్యాత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తాను అని తెలిపారు. వై.వి.ఎస్ చౌదరి బాధని దిగమింగుకొని హరికృష్ణగారి గురించి ఈ విధంగా కవిత రాశారు.

సంబంధిత సమాచారం :

X
More