మరోసారి సీనియర్ ఎన్.టి.ఆర్ బ్రాండ్ ని వాడుకొంటున్న వైవిఎస్ చౌదరి

మరోసారి సీనియర్ ఎన్.టి.ఆర్ బ్రాండ్ ని వాడుకొంటున్న వైవిఎస్ చౌదరి

Published on Sep 8, 2015 7:22 PM IST

yvs-chidari
దర్శకనిర్మాతగా సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వైవిఎస్ చౌదరి సుమారు రెండేళ్ళ పాటు కష్టపడి సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన ‘రేయ్’ సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యి ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా నిరాశ పరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్న వైవిఎస్ చౌదరి ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం ఒక ప్యూర్ లవ్ ఎంటర్టనర్ కథని రాస్తూ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ఈ ప్రేమకథకి మరోసారి సీనియర్ ఎన్.టి.ఆర్ ఫేమస్ సాంగ్ నుంచి టైటిల్ ని ఎంచుకున్నాడు.

నందమూరి తారకరామారావు నటించిన ‘భలే తమ్ముడు’ సినిమాలో ‘నేడే.. ఈనాడే.. కరునించే నన్ను చెలికాడే’ అనే పాట బాగా ఫేమస్. ఇప్పుడు ఇదే లైన్ ని వైవిఎస్ చౌదరి తన నెక్స్ట్ సినిమాకి ఫిక్స్ చేసాడు. అంతే కాకుండా ‘నేడే.. ఈనాడే.. కరునించే నన్ను చెలికాడే’ అనే టైటిల్ ని బొమ్మరిల్లు బ్యానర్ పై ఫిల్మ్ చాంబర్లో రిజిష్టర్ కూడా చేసాడు. గతంలో హరికృష్ణతో చేసిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే టైటిల్ కూడా ఫేమస్ ఎన్.టి.ఆర్ సాంగ్ నుంచి తీసుకున్నదే. ఇప్పటికే పలుసార్లు కొత్త నటీనటులను తన బ్యానర్ ద్వారా పరిచయం చేసిన వైవిఎస్ చౌదరి ఈ సినిమా ద్వారా కూడా కొత్తవారిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు. వైవిఎస్ చౌదరి ప్రస్తుతం పూర్తి కథని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు