దర్శకుడు కమ్ నిర్మాతగా పిలిపించుకున్న వై.వి.ఎస్ చౌదరి గతంలో పలు మంచి సినిమాలే చేశాడు. ఆతరువాతే వరుసపెట్టి ‘నిప్పు’, ‘ఒక్క మగాడు’ మరియు ‘సలీమ్’ వంటి సినిమాలు ఘోర పరాజయాలు చవిచూసాయి. వీటన్నిటినీ పక్కనబెట్టి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ‘రేయ్’ అనే భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశాడు
ఈ సినిమా చాన్నాళ్ళుగా షూటింగ్ ని జరుపుకోవడమే కాక చాలా సార్లు వాయిదాపడుతూ వస్తుంది. చిత్రాన్ని తిరిగి ప్రారంభించడానికి లేక విడుదలచెయ్యడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా అవన్నీ వృధాగా మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం చౌదరిగారు సైలెంట్ అయిపోయారని సమాచారం
తన స్నేహితులు, బంధువుల ఫోన్ లను సైతం తిరస్కరిస్తున్నట్టు సమాచారం. మరి మన చౌదరిగారు ఈ సినిమాను ఎలాగన్నా విడుదలచెయ్యాలని కోరుకుందాం


