స్ట్రాంగ్ గా నిలబడుతున్న “జాంబీ రెడ్డి”.!

స్ట్రాంగ్ గా నిలబడుతున్న “జాంబీ రెడ్డి”.!

Published on Feb 10, 2021 1:27 AM IST

Zombie Reddy
మన టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ చిత్రాలను తెరకెక్కించే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులలో ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. అలా తాను లేటెస్ట్ గా తీసిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “జాంబీ రెడ్డి”. యువ హీరో తేజ సజ్జ హీరోగా ఆనంది హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ లేటెస్ట్ చిత్రం గత వారం విడుదల కాబడి అద్భుతమైన టాక్ మరియు ఓపెనింగ్స్ దక్కించుకుంది.

మన తెలుగులో ఇది వరకు చెయ్యని కొత్త జానర్ పైగా దానికి ఎంతో ఎంటర్టైన్మెంట్ ను జోడించి ప్లాన్ చేసిన ఈ చిత్రం గత వారపు వీకెండ్ మూడు రోజులు కూడా అదరగొట్టింది. మరి అలాగే ఇప్పుడు ఫస్ట్ సోమవారం ఎలా ఉంటుందా అనుకున్న సమయంలో కూడా స్ట్రాంగ్ గా నిలబడి అదరగొట్టింది అని చెప్పాలి.

ఉత్తరాంధ్రలో అయితే అన్ని షోలు కూడా చాలా మేర మంచి ఆక్యుపెన్సీను రాబట్టాయని తెలుస్తుంది.అలాగే ఈ చిత్రం ఆల్రెడీ ప్రాఫిట్ జోన్ లోకి కూడా వచ్చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్రం ఈ “జాంబీ రెడ్డి” ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు