సమీక్ష : పరిణితిలేని సమర్పణ – పిల్ల జమీందారు

సమీక్ష : పరిణితిలేని సమర్పణ – పిల్ల జమీందారు

Published on Oct 15, 2011 4:03 AM IST
విడుదల తేదీ : 14 అక్టోబర్ 2011
123Telugu.com రేటింగ్ : 2.5 / 5
దర్శకుడు : అశోక్
నిర్మాత : ఎస్ఎస్ బుజ్జి
సంగీత దర్శకుడు : సెల్వ గణేష్
పాత్రలు : నాని, బిందు మాధవి, హరిప్రియ, అవసరాల శ్రీనివాస్, రావు రమేష్, ఎంఎస్ నారాయణ, శిల్పా

పిల్ల జమిందారు చిత్రంలో నాని, బిందుమాధవి, హరి ప్రియ తదితరులు తారాగణం. శ్రీ శైలేంద్ర మూవీస్ బ్యానర్ పై అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయావకాశాలు ఎలాఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కథ : ఈ చిత్ర కథ ‘ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్’ మాదిరి సాగుతుంది. ప్రవీణ్ జయరామరాజు పీజే (నాని) చాలా ధనవంతుల బిడ్డ. దారితప్పి ఆకతాయిగా ప్రవర్తిస్తుంటాడు. అతను దురహంకారంతో చుట్టూ ఉన్న వాళ్ళతో చాల అసభ్యంగా మసులుతుంటాడు. జమీందారు రుద్రరామ రాజు (బాపినీడు) యావదాస్తికీ చట్టపరమైన వారసుడు పీజే. అదే అతని అహంకారం కారణం. జీవితం పట్ల పీజే వైఖరి మార్చాలని, అతనిలో విలువలు పెంపొందించాలని రుద్రరామ రాజు తలపోస్తాడు. అందుకోసం కొన్ని లక్ష్యాలను పీజే ముందు ఉంచుతాడు. ఇవి సాధిస్తేనే నీకు సంపద చెందుతుందని షరతు విధిస్తాడు. ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పీజే సిరిపురం అనే ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వం కళాశాల లో చదువుకునేందుకు పనయనమవుతాడు. మిలిటరీ రాజన్న(రావు రమేష్) కళాశాల ప్రిన్సిపాల్. అక్కడ తన మాజీ స్నేహితురాలు సింధు(హరి ప్రియ) తో సహా, వివిధ రకాల మనుష్యలు జీపీ కి తారసపడతారు. తద్వారా కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటాడు.

ఇవి బావున్నాయి : పిల్ల జమీందారు సినిమాలో కొన్ని మంచి కామెడీ సన్నివేశాలు, వివిధ సందర్భాలలో డైలాగ్స్ బావున్నాయి. ఈ చిత్రం కథకు హీరో నాని పర్ఫెక్ట్ గా సరిపోయాడు. అతను కొన్ని సందర్భాలలో తన మునపటి సినిమాలలో కంటే మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఈ చిత్రం లో కొన్ని పవర్ ఫుల్ రోల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా, ఎంఎస్ నారాయణ(తెలుగు లెక్చరర్), రావు రమేష్ మరియు శ్రీనివాస్ అవసరాల(కన్నబాబు) చక్కటి ప్రతిభను కనబరిచారు. హరి ప్రియ, సింధు గా మెప్పించింది. కాని ఆమెకు పూర్తి స్తాయిలో అభినయించే పాత్ర ఈ చిత్రంలో లేదు.

చివరలో వెన్నెల కిషోర్, వేణు కామెడి చిత్రానికి అదనపుబలాన్ని చేకూర్చింది. వారి హాస్య సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది మంచి సందేశాత్మక సినిమా.. కొన్ని ఆధిపత్యాలు వ్యక్తిగత సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతాయో ఈ మూవీ లో చూడవచ్చు.

కొన్ని వన్ లైనర్స్ మరువలేనివి గా ఉన్నాయి. “దేవుడు మనుషుల్ని ప్రేమించి, వస్తువులను వాడుకోవటానికి తాయారు చేసాడు. కానీ మనం వస్తువులని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటున్నాం ” వంటివి. అయితే ఐటెం సాంగ్ కు మాత్రం ప్రేక్షకులు నుంచి స్పందన కరువైంది.

ఇవి బాగులేవు : హీరో నాని కొన్ని సందర్భాలలో ఖలేజలో మహేష్ బాబు నటనను అనుకరించే ప్రయత్నం కనిపించింది ఆ సీన్స్ పండలేదు. నాని- హరి ప్రియ మధ్య శృంగార సన్నివేశాలు సంపూర్ణంగా లేవు, వీరి మధ్య అస్సలు కెమిస్ట్రీ లేదు.

చాల వరకూ ‘కామెడీ’ సీన్స్ ప్రేక్షకులకు నవ్వు తెప్పించలేక పోయాయి. మూస హాస్యం కోవలోకే చేరిపోయాయి. నాని కజిన్ గా బిందు మాధవి పాత్ర వ్యర్ధమైంది. చివరలో పీజే పాత్ర వాస్తవ పరిస్తితులకు చాల దూరంగా ఉంది. సెంటిమెంట్ సీన్స్ లో రియాలిటీ కొరవడింది. ఒక దురహంకార యువకుడు పరివర్తన చెందిన దృశ్యాలు 80 – 90 లో వేల సార్లు చూపబడ్డాయి.

కళాశాల రాజకీయాలు, క్లాస్ రూం సన్నివేశాలు ఘోరంగా విఫలమయ్యాయి. స్క్రీన్ ప్లే, దర్శకత్వం సెకండ్ హాఫ్ లో ఓ మోస్తరు అనిపించింది. గుర్తుంచుకోవడానికి ఒక చిరస్మరణీయ పాట కూడా సినిమాలో లేకపోవటం విచారకరం. ఇక చిత్రీకరణ గురించి వ్రాయడానికి ఏమీ లేదు.

సాంకేతిక విభాగాలు : చంద్ర శేఖర్ డైలాగ్స్ కొన్ని చోట్ల బాగా పేలినప్పటికీ, చాల సందర్భాలలో తుస్ మన్నాయి. సంగీత దర్శకుడు సెల్వ గణేష్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు అన్ని చోట్లా నిరుత్సాహ పరిచాడు. సినిమా బడ్జెట్ కు అనుగుణంగానే ఎడిటింగ్, సినిమాటోగ్రఫి ఉంది.

కొరియోగ్రఫీ పరంగా ప్రేక్షకులను ఉత్తేజ పరిచేది ఏది లేదు. ఈ చిత్రానికి అతిపెద్ద అంగవైల్యం స్క్రీన్ ప్లే. స్టొరీ చెప్పిన విధానం బాలేదు. స్క్రిప్ట్ లో చాల చోట్ల లోటుపాట్లు కనిపించాయి. దర్శకుడు కామెడి సన్నివేశాలను రక్తి కట్టించలేక పోయాడు. అతని అనుభవశూన్యత కొట్టొచ్చినట్టు కనబడుతుంది.

తీర్పు : అసలు.. పిల్ల జమీందారు ఒక సురక్షిత ఫార్ములా చిత్రంగా వుండాలి. అయితే ఆ ఫార్ములా ను సరిగ్గా అమలు చేస్తే బాగుండేది. పేపర్ పైన కామెడీ, సెంటిమెంట్, కాలేజ్ డ్రామా, ఒక మంచి సామాజిక సందేశం మొదలైనవి అన్నీ ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయటంలోనూ, చిత్రీకరించటం లోనూ పూర్తిగా విఫలమైనట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వెన్నెల కిషోర్, వేణు కామెడి ప్రతి ప్రేక్షకుడికీ కాస్త ఉపశమనం. పిల్ల జమీందారు కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఓకే, చాల చోట్ల నిరుత్సాహమే.

-నారాయణ ఎ.వి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు