సమీక్ష : ‘7 డేస్‌ 6 నైట్స్‌’ – స్లోగా సాగే రొమాంటిక్ డ్రామా !

సమీక్ష : ‘7 డేస్‌ 6 నైట్స్‌’ – స్లోగా సాగే రొమాంటిక్ డ్రామా !

Published on Jun 25, 2022 3:02 AM IST
Chor Bazar Movie Review

విడుదల తేదీ : జూన్ 24, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతికా శెట్టి

దర్శకత్వం : ఎంఎస్ రాజు

నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్

సంగీత దర్శకుడు: సమర్థ్ గొల్లపూడి

సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి

ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ


ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు దర్శకుడిగా ‘డర్టీ హరి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం అందించిన విజయోత్సాహంతో ఆయన మళ్ళీ ‘7 డేస్‌ 6 నైట్స్‌’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సుమంత్‌ అశ్విన్‌, ఎస్‌. రజనీకాంత్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

కథ :

ఆనంద్ (సుమంత్ అశ్విన్) సినిమా డైరెక్టర్ కావాలని కష్ట పడుతూ ఉంటాడు. మరోపక్క ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళినా.. ఆమెనే తల్చుకుని బాధ పడుతూ ఉంటాడు. అయితే, ఆనంద్ కి కుమార్ మంగళం (రోహన్) అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఇద్దరు బాగా క్లోజ్ గా ఉంటారు. ఆనంద్, కుమార్ మంగళం ఇద్దరూ గోవా ట్రిప్ కి వెళ్తారు. అక్కడ రతిక (మెహర్ చావల్)తో ఆనంద్ ప్రేమలో పడతాడు. అలాగే కుమార్ మంగళం కూడా అమియా (క్రితికా శెట్టి)తో ప్రేమలో పడతాడు. మరి వీరి ప్రేమలు కారణంగా వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి ? ఆనంద్ లక్ష్యం ఏమైంది ? చివరకు వీరి కథలు ఎలా ముగిశాయి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన సుమంత్ అశ్విన్, రోహన్ తమ నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు. ఇక సినిమాలో గోవా ట్రిప్ సన్నివేశాలు.. అదేవిధంగా ఆ జర్నీలో అనుకోని సంఘటనలతో సమస్యల వలయంలో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే వాళ్ళు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు, ఈ క్రమంలో ఎదురయ్యే ఫన్ బాగుంది.

మెహర్ చావల్ తో సాగే సీన్స్ లో సుమంత్ నటన బాగుంది. మెహర్ చావల్ కూడా తన అందంతో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక సుమంత్ అశ్విన్, రోహన్ తమ కామెడీ టైమింగ్‌ తో బాగా నవ్వించారు. క్రితికా శెట్టి కూడా చాలా గ్లామరస్ గా కనిపించింది. గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఎంఎస్ రాజు ఈ సినిమాలో నాలుగు క్యారెక్టర్స్ జర్నీలో కొన్ని బలమైన ఎమోషన్స్ పెట్టి మంచి ఫీల్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే, అలాగే ఆ పాత్రల్లో ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేయడానికి కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అలాగే హీరో క్యారెక్టర్ చాలా పాసివ్ గా ఉంది.

అదే విధంగా రెగ్యులర్ కామెడీతో అక్కడక్కడా నవ్వించినా.. చాలా సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇక ప్రధాన పాత్రల మధ్య ఉన్న కామెడీ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ ను సరిగ్గా వాడుకోలేదు. కథ కూడా చాలా సింపుల్ గా ఉంది. ఇక ప్లే కూడా వెరీ రెగ్యులర్ గా సాగింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కొన్ని గోవా సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని ఎమోషనల్ కంటెంట్ ను దర్శకుడు బాగా తెరకెక్కించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను నాని చమిడిశెట్టి చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు :

‘7 డేస్‌ 6 నైట్స్‌’ అంటూ వచ్చిన ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లో కొన్ని సీన్స్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయి. అయితే స్లో ప్లే, సింపుల్ ట్రీట్మెంట్ సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే నటీనటుల నటన ముఖ్యంగా సుమంత్ అశ్విన్, రోహన్ తమ నటనతో మెప్పించారు. యూత్ కి ఈ సినిమాలోని కొన్ని కీలక అంశాలు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు