ఓటిటి రివ్యూ : ‘ఏకే వర్సెస్ ఏకే’ – (హిందీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

ఓటిటి రివ్యూ : ‘ఏకే వర్సెస్ ఏకే’ – (హిందీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

Published on Dec 26, 2020 3:01 AM IST

నటీనటులు : అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్, సోనమ్ కపూర్ తదితరులు.
దర్శకత్వం : విక్రమాదిత్య మోట్వానే
నిర్మాత : దీపా మోట్వానే
ఎడిటింగ్ : బుంటీ భన్సాలీ

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న ఫిల్మ్ ‘ఏకే వర్సెస్ ఏకే’. నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులో ఉన్న ఈ ఫిల్మ్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.

 

కథ:

 

విక్రమాదిత్య మోట్వానే దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రత్యేకమైన చిత్రంలో అనిల్ కపూర్ మరియు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. అనిల్ కపూర్ – అనురాగ్ కశ్యప్ మధ్య ఒక చిన్న వాదనతో మొదలైంది ఈ కథ. తమ వాదనలో కలత చెందిన అనురాగ్ అనిల్ కపూర్ ముఖం మీద నీళ్ళు కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కొన్ని సంఘటనల అనంతరం అతను అనిల్ కపూర్ వద్దకు తిరిగి వచ్చి, తన కుమార్తె సోనమ్ కపూర్ ను కిడ్నాప్ చేశాడని.. ఆమెను కనుగొనడానికి కేవలం 10 గంటలు మాత్రమే ఉందని చెబుతాడు. అనిల్ పోలీసుల వద్దకు వెళ్ళకుండా అతని ఇన్విస్టిగేషన్ మొత్తం ప్రత్యక్షంగా రికార్డ్ చేయబడి, సినిమా లాగా విడుదల అవుతుందని అనురాగ్ చెబుతాడు. మరి అనిల్ కపూర్ ఏమి చేసాడు ? అతను తన కుమార్తెను ఎలా కనుగొన్నాడు అనేది మిగిలిన కథ.

 

ఏది మంచిది:

 

ఈ కథ ఆలోచనే ప్రత్యేకమైనది. భారతీయ చిత్రాలకు ఇలాంటి కథ మొదటిది అనే చెప్పాలి. విలన్ బెదిరించే సన్నివేశాలు మరియు ప్రధాన పాత్ర తన కుమార్తెని వెతికే సీన్స్ అలాగే ప్రత్యక్షంగా రికార్డ్ చేసిన విధానం చాల బాగుంది. అలాగే మిగిలిన అంశాలన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించారు. ఇక ఈ చిత్రం చాలా ఆసక్తికరంగా మరియు ప్రత్యేకమైనదిగా అనిపిస్తోంది.

తన బిడ్డను కాపాడటానికి ప్రయత్నిస్తున్న తండ్రి పాత్రలో అనిల్ కపూర్ చాల బాగా నటించాడు. ఈ చిత్రం ద్వారా అతను టెన్షన్ మరియు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో ఉన్నట్లు ఇచ్చిన ఫీలింగ్ చాల బాగుంది. ఇక అనురాగ్ కశ్యప్ కూడా బాగా నటించాడు. నిజ జీవిత సంఘటనలతో దర్శకుడు బాగా ఆకట్టుకున్నాడు. కెమెరా వర్క్ కి ప్రత్యేక ప్రస్తావన అవసరం, ఎందుకంటే కీలక పాత్రల కదలికలను కవర్ చేసిన విధానం చాల బాగుంది.

కొన్ని సీన్స్ ను ప్రత్యక్షంగా చూసే అనుభూతిని పొందుతాము. నిర్మాణ విలువలు మరియు విజువల్స్ కూడా బాగున్నాయి.

 

వాట్ బాడ్:

 

సినిమా అంతటా, మనకు అనిపించే ఏకైక ఆలోచన ఏమిటంటే ఈ చిత్రంలో నిజమైన క్రైసిస్ ఏమిటి ? అనే కోణంలో కథ అంత గొప్పగా అనిపించదు. ఆలాగే ప్లే కూడా అంత గొప్పగా అనిపించదు. కొన్ని చోట్ల కథ కరెక్ట్ గా ప్రదర్శించబడలేదు. ముగింపు అంత గొప్పగా ఏమి లేదు. ఇక కొన్ని సీన్స్ ఇంకా మరింత ఆకర్షణీయంగా ప్రదర్శించే అవకాశం ఉన్నా దర్శకుడు సింపుల్ గా ముగించాడు. అలాగే, కొన్ని సన్నివేశాల్లోని లాజిక్ లేదు.

తీర్పు:

మొత్తానికి, ఏకె వర్సెస్ ఏకె చాలా ప్రత్యేకమైన చిత్రం, ఇది వేరే టోన్ లో వివరించబడిన కథ. ఇక అనిల్ కపూర్ మరియు అనురాగ్ కశ్యప్ పాత్రలు, అలాగే కొన్ని సీన్స్ మరియు ఘర్షణలు బాగున్నాయి. ఎండ్ ట్విస్ట్‌ను ఇంకా బాగా హైలైట్ చేయాల్సింది. ఇక సాధారణ రన్‌టైమ్ మరియు క్రేజీ కథనం ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా చూసేలా చేస్తాయి.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు