ఆడియో రివ్యూ : అత్తారింటికి దారేది – ఇప్పటి వరకు వచ్చిన వాటికంటే కాస్త డిఫరెంట్

‘అత్తారింటికి దారేది’ ఆడియోని శిల్ప కళావేదికలో చాలా గ్రాండ్ గా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాలోని పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1. ఆరడుగుల బుల్లెట్

పాడిన వారు : విజయ్ ప్రకాష్, ఎంఎల్ఆర్ కార్తికేయన్
రచయిత: శ్రీమని

‘ఆరడుగుల బుల్లెట్’ ఇది రాకింగ్ సోలో సాంగ్. ఈ పాటకి శ్రీమని సాహిత్యాన్ని అందించడం జరిగింది. రచయిత ఈ పాటకి చాలా చక్కని సాహిత్యాన్నిఅందించారు. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ ప్రకాష్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఈ పాటను చాలా చక్కగా పాడారు. ఈ పాట పవన్ కళ్యాణ్ ఇంటర్డ్యుసింగ్ సాంగ్ అయ్యే అవకాశం వుంది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పాటకు తగినట్టుగా అందరిని ఆకట్టునేదిగా వుంది. ఇది చాలా మందికి నచ్చుతుంది.

2. నిన్ను చూడగానే

పాడినవారు : దేవీ శ్రీ ప్రసాద్
రచయిత : దేవీ శ్రీ ప్రసాద్

‘నిన్ను చూడగానే’ సాంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని అందించిన సోలో సాంగ్. ఈ పాటకి దేవీ శ్రీ మంచి సాహిత్యాన్ని అందించాడు. ఈ పాటని హీరో తన మరదలును చూసి ప్రేమలో పడ్డప్పుడు ఫీల్ అవుతూ పాడే పాట అయి ఉండవచ్చు. ఈ పాట వినడానికి చాలా డీసెంట్ గా ఉంది. దీనిని మంచి విసువల్స్ తో మద్య చిత్రీకరించే అవకాశం ఉంది. ఈ పాటకి మంచి గుర్తింపు వస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం చక్కని ట్యూన్ ని, సాహిత్యాన్ని అందించాడు.

 

3. దేవా దేవం

పాడినవారు : పాలక్కాడ్ శ్రీరామ్, రీట
రచయిత: రామజోగయ్య శాస్త్రి

ఇది ఒక బిట్ సాంగ్. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయడం జరిగింది. పాలక్కాడ్ శ్రీరామ్, రీటలు ఎంతో జాగ్రత్తగా, చక్కగా ఈ పాటను పాడారు. ఈ పాట ఏదైనా ముఖ్యమైన సమయంలో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వచ్చే అవకాశం వుంది. ఈ పాటకి చాలా చక్కగా సాహిత్యానికి తగినట్టుగా చాలా చక్కగా పాడారు.

 

4. బాపు గారి బొమ్మ

పాడిన వారు:
శంకర్ మహదేవన్
రచయిత: రామజోగయ్య శాస్త్రి

‘బాపు గారి బొమ్మ’ ఒక మంచి అందమైన పాట. చక్కని సంగీతంతో పద్దతిగా ఈ పాట మొదలవుతుంది. శంకర్ మహదేవన్ ఈ పాటని పాడారు. తన వాయిస్ తో ఈ పాటని చక్కగా పాడి తగిన న్యాయం చేశాడు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి సాహిత్యాన్ని అందించాడు. ఈ పాటకి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అందరిని చాలా భాగా ఆకట్టుకుంటుంది. ఈ పాట కోసం తను భారతీయ సంగీత వాయిద్యాలను ఉపయోగించారు. ఈ ఆల్భమ్ ఈ పాట బెస్ట్ సాంగ్ అవుతుంది.

 

5. కిర్రకు

పాడినవారు :డేవిడ్ సైమన్, నరేంద్ర
రచయిత: రామజోగయ్య శాస్త్రి

‘కిర్రకు’ ఇది ఈ ఆడియోలో మరొక సోలో సాంగ్. చాలా ఫాస్ట్ గా సాగే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాశారు. డేవిడ్ సైమన్, నరేంద్ర చాలా కేర్ తీసుకోని ఈ పాటను పడటం జరిగింది. ఈ పాట బాగానే ఉంది. ఈ పాటకు అందించిన సంగీతంలో చెప్పుకోదగినంత ప్రత్యేకత ఏమిలేదు.

 

6. టైం టూ పార్టీ

పాడినవారు : డేవిడ్ సైమన్, మాల్గుడి శుభ

రచయిత: రామజోగయ్య శాస్రి

‘టైం టూ పార్టీ’ ఇది ఒక పార్టీ సాంగ్. ఈ పాటని డేవిడ్ సైమన్, మాల్గుడి శుభలు పాడారు. వీరిద్దరూ ఈ పాటకు సరైన న్యాయం చేశారు. శుభ హస్కీ వాయిస్ ఈ పాటకు మాస్ గా అనిపిస్తుంది. రామజోగయ్య శాస్రి పాటకు చక్కని సాహిత్యాన్ని అందించారు. ఈ పాట ఫ్రంట్ బెంచ్ వారిలో ఉత్సాహాన్ని నిప్పుతుంది. ఈ పాట కోసం దేవీ శ్రీ ప్రసాద్ చక్కని, ఫాస్ట్ గా సాగే సంగీతాన్ని అందించాడు. ఈ పాట చివరి వరకు చాలా డీసెంట్ గా ముగుస్తుంది.

తీర్పు :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ ఆడియో గతంలోని పవన్ కళ్యాణ్ సినిమా ఆడియోలతో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్ గా ఉంది. మిగిలిన సినిమాల కంటే ఈ సినిమా టైటిల్ డిఫరెంట్ గా ఉంది. అలాగే ఈ ఆల్భమ్ లోని పాటలు క్లాసిగా, సుక్ష్మంగా వున్నాయి. దీనిలో మాస్ మసాలా పాటలు లేవు. ఈ ఆల్బమ్ లో ‘బాపు గారి బొమ్మ’, ‘ఆరడుగుల బుల్లెట్’, ‘నిన్ను చూడగానే’ పాటలు చాలా బాగున్నాయి.

రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

More