ఆడియో రివ్యూ : పవర్ ఫుల్ ఎమోషన్స్ మెలోడి – ‘బెజవాడ’


పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా ‘బెజవాడ’ లో నాగ చైతన్య విశ్వరూపం చూడవచ్చు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కోనేరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వివేక్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. అమల పాల్ హీరోయిన్. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండానే ఈ సినిమా ఆడియో మార్కెట్ లోకి విడుదలయింది. ఈ మూవీ నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతాన్ని పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ అందించటం విశేషం.

1 . సాంగ్ : దుర్గమ్మ కృష్ణమ్మా
కళాకారులు : జోజో నతానియేల్
సాహిత్యం : రెహ్మాన్

ఇది ఒక పవర్ ఫుల్ సాంగ్. విజయవాడ గా పిలువబడుతోన్న బెజవాడ లో పుట్టి పెరిగిన వారికి ఈ సాంగ్ రోమాలను నిక్క బొడిచే అనుభూతిని ఇచ్చేలా ఉంటుంది. విజయవాడ ప్రాముఖ్యత అక్కడి ప్రజల ధైర్య సాహసాలు ప్రతిబంభించేలా ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్ ద్వారా జోజో నతానియేల్ శక్తి సామర్ధ్యాలు, అతన్ని ఉత్సాహం బయటపడ్డాయి. శ్రోతలు భావోద్రేగానికి గురయ్యే ఈ పాట కు సంగీతం కూడా బావుంది.

2. సాంగ్ : అడగక నన్నేమి
కళాకారులు : జావేద్ ఆలీ, చంద్రాయీ భట్టాచార్య
సాహిత్యం : కలువ సాయి

ఇది చాలా సాఫ్ట్ గా సాగే ఒక శృంగారభరిత అనుభూతినేచ్చే యుగళ గీతం. ఈ సాంగ్ ను అద్భుతంగా తెరకెక్కించే అవకాశం ఉంది. జావేద్ ఆలీ, చంద్రాయీ భట్టాచార్య ఈ పాటను వినసొంపుగా ఆలపించారు. కలువ సాయి సాహిత్యం బావుంది. ఆకట్టుకునే విధంగా ఉండే ఈ పాట వినటానికంటే చూస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

3. సాంగ్ : నిన్ను చూసిన
కళాకారులు : జావేద్ ఆలీ, శ్వేతా పండిట్
సాహిత్యం : సిరా శ్రీ

ఇది మరో రొమాంటిక్ సాంగ్. ఈ పాట గత రామ్ గోపాల్ వర్మ చిత్రం లోని ఊర్మిళ చేసిన పాటలా సాగుతుంది. చిత్రీకరణ కూడా అలానే సాగే అవకాశం కనిపిస్తోంది. జావేద్ ఆలీ, శ్వేతా పండిట్ ఆలపించిన తీరు బానేఉంది. సిరా శ్రీ సాహిత్రం సాధారణంగానే ఉంది. ఈ సాంగ్ ఎలా పండుతుందనేది చిత్రీకరనపైనే ఆధారపడి ఉంటుంది.

4. సాంగ్ : కొంటె చూపులు
కళాకారులు : హేమచంద్ర, గీతా మాధురి
సాహిత్యం : రెహ్మాన్

స్నేహితుని పెళ్లి వేడుక సందర్భంలో ఈ సాంగ్ వచ్చే అవకాశం ఉంది. రెహ్మాన్ రచన ఓ మోస్తరుగా ఉంది. హేమచంద్ర, గీతా మాధురి గానం వీనుల విందుగా సాగింది. మ్యూజిక్ భావాత్మకంగా ఉంది.

5. సాంగ్ : రమ్ము జిన్ను
కళాకారులు : దీప్తి చారి
సాహిత్యం : సిరా శ్రీ

ఇది మూవీ లో ఐటెం సాంగ్. దీప్తి చారి పెర్ఫార్మన్స్ ఓకేగాని, అంత కిక్కెక్కించే విధంగా లేదనిపిస్తుంది. సిరా శ్రీ సాహిత్యం గురించి చెప్పనక్కర్లేదు. సంగీతం సాధారణంగా ఉంది. లేరిక్స్ , వోకల్స్ డిపార్ట్మెంట్ లో మరింత శ్రద్ధ కనబరిచి ఉంటే బావుండేది.

6. పాట : అలిగిరి నందిని
కళాకారులు : రవిశంకర్
సాహిత్యం : శ్రీ ఆది శంకరాచార్యులు

ఈ పాట ప్రముఖ భక్తి గీతానికి ఆది శంకరాచార్యులు కలం నుంచి లిఖించబడ్డ రీమిక్స్. సానుకూల శక్తి సామర్త్యాలు పెంచే విధంగా ఈ పాట సాగుతుంది. రవిశంకర్ గాత్రం ఈ సాంగ్ మంచి గా రావటానికి దోహదకారి అయింది. మ్యూజిక్ డామినేటేడ్ గా ఉంది. అయితే ఈ పాట సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.

7.సాంగ్ : బేజా బేజా
కళాకారులు : జో జో నతానియేల్
సాహిత్యం : సిరా శ్రీ

ఇది చిత్రం లో చాలా భలంగా కనిపించే కనిపించే పాట. జోజో నతానియేల్ అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫాస్ట్ బీట్ తో సాగే ఈ పాట చూసేటప్పుడు సైతం భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంది. సిరా శ్రీ సాహిత్యం చక్కగా ఉంది.

8. పాట : లే లెగర
కళాకారులు : శ్రీకాంత్
సాహిత్యం : చైతన్య ప్రసాద్

అసమానతలను రూపుమాపే సమయంలో హీరోకి స్ఫూర్తిదాయకంగా నిలిచే పాట ఇది. శ్రీకాంత్ గానం వినేవారికి ఎమోషన్స్ రప్పించే విధంగా ఉంది. చైతన్య ప్రసాద్ సాహిత్యం బావుంది. మ్యూజిక్ సందర్బోచితంగా సాగుతుంది.

తీర్పు:

ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా సాగే ‘బెజవాడ’ చిత్ర ఆడియో అంత విభిన్నంగా లేదు. ఓ వైపు చాలా ఉత్తేజకరంగా సాగే ‘దుర్గామ్మా.. కృష్ణమ్మా పాట, మరోవైపు చాలా సాఫ్ట్ గా సాగే ‘అడగకు నన్నేమి’ సాంగ్ ద్వారా వేర్వేరు భావోద్వేగాలకు చోటిచ్చే విధంగా ఉంది. ఈ మూవీ పాటల్లో కొన్ని మంచి నంబర్స్ ఉన్నాయి. సాంగ్స్ చిత్రీకరణలో రామ్ గోపాల్ వర్మ ట్రేడ్ మార్క్ ప్రతిఫలిస్తుంది. ఈ ఆల్బంకి నిజమైన విజయం.. పాటల చిత్రీకరణ, సినిమాటోగ్రఫీ మీదే ఆధార పడి ఉంటుంది.

నారాయణ – ఎవి

సంబంధిత సమాచారం :