సమీక్ష : బ్యాడ్ బాయ్ – సినిమా చాలా బ్యాడ్ గా ఉంది

విడుదల తేదీ : 22 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : సురాజ్
నిర్మాత : కె. ఇ. జ్ఞానవేల్ రాజ
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు : కార్తి, అనుష్క

కార్తీ తమిళంలో నటించిన ‘అలెక్స్ పాండ్యన్’ సినిమాని తెలుగులో ‘బ్యాడ్ బాయ్’ గా అనువదించారు. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి సురాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాను నిర్మాతలు ఈ సినిమా గురించి భారీగా ప్రచారం చేశారు. ఈ సినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

అలెక్స్ పాండు(కార్తీ) ఈ సినిమాలో ఒక మొరటోడుగా మాస్ గా కనిపిస్తాడు. అల్విన్ మార్టిన్(మిలింద్ సోమన్), డా. జి.ఎం.కె(సుమన్), స్వామిజీ (మహదేవన్) లు అలెక్స్ కు హెల్త్ మినిస్టర్ కూతురు అనుష్కను కిడ్నాప్ చేయమని కాంట్రాక్ట్ ఇస్తారు. వారు ఎందుకు హెల్త్ మినిస్టర్ పై కోపంగా వున్నారు? అంటే.. అల్విన్ మార్టిన్ కొన్ని మందులను తయారు చేసి సిటీలో డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటాడు. కానీ ఈ మందులు మంచివి కావని యుఎస్ ఎఫ్.డీ.ఎ రద్దు చేసిన లిస్టులో వుంటాయి. కావున దానికి సంబందించిన ఫైల్ ని మంత్రి తిరస్కరిస్తాడు. అలెక్స్ అనుష్కని కిడ్నాప్ చేస్తాడు. అనుష్కని అప్పగించి తన కాంట్రాక్ట్ డబ్భుల కొరకు వెళ్ళిన అలెక్స్ మనసు మారిపోతుంది. ఎందుకంటే అనుష్క అతనికి జరిగినదంతా చెబుతుంది. అలెక్స్ అనుష్కను ఎలాగైనా కాపాడి వారి తల్లిదండ్రులకు అప్పగించాలని నిర్ణయించుకుంటాడు. దీనికోసం సంతానంను, అతని కుటుంబ సభ్యుల (మనోబాల, నికిత, సనూష )సహాయాన్ని తీసుకుంటాడు. ఎలా అనుష్కని అలెక్స్ ఈ క్రిమినల్స్ నుండి కాపాడతాడు. అసలు అనుష్క చెప్పిన నిజం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ‘బ్యాడ్ బాయ్’ సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

కార్తీ చాలా అందంగా కనిపించాడు. ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకోవడనికి కార్తీ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ అదృష్టం కలిసి రావాలంటే మంచి స్క్రిప్ట్ ను ఎంచుకొని ఉండాల్సింది. అనుష్క కూడా ఇదేవిదంగా ప్రయత్నిచింది. తను సినిమాలో చాలా అందంగా కనిపించింది. తన లెగ్స్ పై చిత్రీకరించిన సన్నివేశాలు అన్నింటికంటే బాగున్నాయి. నికిత చాలా అందంగా వుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, కొన్ని చీప్ కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్. ఒకటి, రెండు యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ :

మసాలా ఎంటర్టైనర్ సినిమాలు ఇలా తీయాకూడదు అనడానికి ఈ సినిమా ఒక చక్కని ఉదాహరణ. డబుల్ మీనింగ్ డైలాగులు, హాట్ హీరోయిన్, ఎక్కువ ఫైట్స్ ఉంటే బాక్స్ ఆఫీసు వద్ద సినిమాకి సక్సెస్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు మంచి చికెన్ బిర్యానీని తినాలనుకున్నారనుకోండి మీరు డబ్బులు చెల్లించి మంచి చికెన్, క్వాలిటీ రైస్, దానికి కావాల్సిన క్వాలిటీ ఐటమ్స్ తీసుకుంటే సరిపోతుందా? లేదుకదా, వాటిని ఎలా మిక్స్ చేయాలన్నది కూడా తెలిసివుండాలి. ఇంకో విషయం అది ఎలా వండలన్నాది కూడా తెలిసి వుండాలి . ఈ సూక్తి ఈ సినిమాకి పక్కాగా సరిపోతుంది.

సంతానం కామెడీ పరవాలేదనిపించేలా ఉన్నా అయన నటన ఎదుటివారిని భాదించే విదంగా వుంది. స్క్రీన్ ప్లే మాములుగా ఉంది. ఈ సినిమాలో కొన్ని అనుకోకుండా వచ్చే ఫైట్స్ వున్నాయి. చివరి సన్నివేశాలను చూస్తుంటే సీట్ లోనుండి ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అనేలా ఉంటాయి. ఈ సినిమాకి ఎంచుకున్న ప్లాట్ ఈజిప్ట్ పిరమిడ్ కన్నా పాతది. ఈ సినిమాలో కామెడీ సీన్స్, డైలాగ్స్ ఇంతకు ముందు ఎప్పుడో విన్నట్టుగా, చూసినట్టుగా వుంటాయి. ఈ సినిమాలోని సెకండాఫ్ చాలా నిదానంగా సాగుతూ, ఆడియన్స్ ఓపికని పరీక్షిస్తుంది. కార్తీ, అనుష్కల మద్య ప్రేమని చివరిగా చూపించడం, అది సరిగ్గా పండించలేకపోవడం రాబోయే సీన్స్ ని మనం ముందుగానే వుహించే విదంగా ఉండడం ఈ సినిమాకి మైనస్.

సాంకేతిక విభాగం :

శరవనన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఎడిటింగ్ సరిగా లేదు. డైలాగులు కూడాఅంతంత మాత్రంగా వున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ పాటల విషయంలో మ్యూజిక్ ఆశించినంత బాగాలేదు. సురాజ్ ఈ సినిమా దర్శకత్వంలో, స్క్రీన్ ప్లే విషయంలో మంచి ప్రతిభని చూపించలేకపోయాడు.

తీర్పు :

గతంలో తమిళ్ లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఓ తమిళ సైట్ రాసిన ‘అలెక్స్ పాండ్యన్’ రివ్యూలో ‘ ఇది 1970లలో వచ్చిన తెలుగు సినిమాలకు స్పూఫ్’ అని రాసారు. అది నిజమే మన బ్రెయిన్ ని పిండేసే ఈ సినిమా కంటే మన 1970ల్లో వచ్చిన సినిమాలే బాగుంటాయి. బహుశా 1980లలో వచ్చిన తమిళ సినిమాకు స్పూఫ్ గా కూడా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. అవన్నీ పక్కన పెడితే కార్తీ కెరీర్లో ఇది మరిచిపోలేని సినిమా. కార్తీకి మంచి క్రేజ్ ఉంది కావున అతను ఆలోచించి సినిమాలు ఎంచుకోవాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ – 2.25/5

అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :