సమీక్ష : చావు కబురు చల్లగా – కొన్ని ఎమోషన్స్ వరకు మాత్రమే

సమీక్ష : చావు కబురు చల్లగా – కొన్ని ఎమోషన్స్ వరకు మాత్రమే

Published on Mar 20, 2021 12:04 PM IST
Chaavu Kaburu Challaga movie review

విడుదల తేదీ : మార్చి 19, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళీ శర్మ, భద్రం

దర్శకత్వం : పెగళ్ళపాటి కౌశిక్

నిర్మాత‌లు : బన్నీ వాసు, అల్లు అరవింద్

సంగీతం : జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ : కర్మ్ చావ్లా

ఎడిటింగ్ : జి. సత్య

టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ రీసెంట్ టైమ్స్ లో మంచి హ్యాపెనింగ్ హీరో కార్తికేయ హీరోగా లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “చావు కబురు చల్లగా”. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మించబడ్డ ఈ చిత్రం మంచి హైప్ నడుమ ఈ రోజే విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్ష ద్వారా తెలుసుకుందాం రండి.

 

కథ :

 

బస్తీ బాలరాజు(కార్తికేయ) వైజాగ్ లోని శవాలను తీసుకెళ్లే ఓ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తూ తన తల్లి ఆమనితో జీవనం గడిపే సామాన్య యువకుడు. మరి అక్కడే ఉండే ఓ వితంతు(లావణ్యా త్రిపాఠి) అనే అమ్మాయిని చూసి తాను ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి ఆమె వెంటే పడుతూ ఎలా అయినా ఇంప్రెస్ చెయ్యాలని చూస్తాడు..కానీ ఊహించని విధంగా మరో పక్క అతని తల్లి మరెవరినో ఇష్టపడుతుంది అని తెలుసుకుంటాడు. మరి ఇక్కడ నుంచి బాలరాజు ఈ క్లిష్ట పరిస్థితులను ఎలా డీల్ చేయగలిగాడు? తన లవ్ ఏమయ్యింది? తన తల్లి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే..

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మొట్ట మొదటిగా చెప్పుకోవాలి అంటే కార్తికేయ రోల్ కోసమే చెప్పాలి. ఓ బస్తీ యువకుడిలా సూపర్బ్ పెర్ఫామెన్స్ ను కనబరిచాడు. పూర్తిగా అలాంటి రోల్ కు ఏం కావాలో అందులో లీనమయ్యి సాలిడ్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే ముందు సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అతని నటన మరింత బెటర్ చేసే స్కోప్ వచ్చింది దీనితో దాన్ని బాగా వినియోగించుకొని ది బెస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ, మురళీ శర్మ తో కామెడీ టైమింగ్ కానీ ఎమోషన్స్ వీటితో పాటు క్లైమాక్స్ లో కనబరిచిన నటనలతో ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు.

మరి లావణ్య రోల్ కు వస్తే కార్తికేయ లానే తనకి కూడా ఇది ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని లాంటి డీ గ్లామ్ రోల్ అటెంప్ట్ చెయ్యడం మంచి విషయం అయితే దానిని అంతే అందంగా చెయ్యడం మరో హర్షణీయ అంశం. చాలా సింపుల్ లుక్స్ తో కనిపించడం వలన ఆమె నటనలో కూడా మరింత సహజత్వం కనిపిస్తుంది. ఎమోషన్స్, తన బాడీ లాంగ్వేజ్ మరియు కొన్ని కీలక సన్నివేశాల్లో తన పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంది.

వీరితో పాటుగా ఈ చిత్రంతో చాలా కాలం అనంతరం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమని మంచి రోల్ లో కనిపించారు. కార్తికేయ తల్లిగా తనకు తగ్గ పాత్రను ఎంచుకొని నీట్ అండ్ క్లీన్ పెర్ఫామెన్స్ ను చూపించారు. అలాగే మురళీ శర్మ కూడా తన రోల్ కు న్యాయం చేకూర్చారు. ఇంకా ఇతర పాత్రల్లో కనిపించిన భద్రం, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు తమ రోల్స్ పరిధి మేరకు తమ మార్క్ నటన కనబరిచారు. అయితే ఈ చిత్రంలో హీరో మరియు అతని తల్లి మధ్య వచ్చే కొన్ని సీన్స్ మంచి ఎమోషనల్ గా ఉండటమే కాకుండా ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ లు ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ఎమోషన్ పాయింట్ కానీ సున్నితమైన కథాంశం కానీ చాలా సున్నితంగా బాగుంటాయి. కానీ అన్ని విధాలా మాత్రం కన్వీనెన్స్ గా అనిపించవు. అలాగే సినిమాలో మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి కూడా కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే ఒకింత విచిత్రంగా అనిపిస్తాయి.

పైగా కాస్త రొటీన్ అండ్ బోర్ కొట్టించే సీన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అలాగే మెయిన్ లీడ్ నడుమ కెమిస్ట్రీ జెనరేట్ చేసేందుకు ఇంకా మంచి కథనం అల్లి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. వీటితో పాటుగా మరో మైనస్ ఏమిటంటే లావణ్య రోల్ ను ఒక సింపుల్ అండ్ సీరియస్ రోల్ లో డిజైన్ చేసుకున్న దర్శకుడు ఒక స్టేజ్ లో సింపుల్ గా పలచబడినట్టు చూపించేసారు.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కానీ సాంకేతిక వర్గ పనితనం కానీ నీట్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా టెక్నీకల్ టీం లో సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఇచ్చిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగున్నాయి తన వల్ల సినిమా మరింత ఇంపాక్ట్ గా అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ ఈ సినిమా నేపథ్యానికి కావాల్సిన సహజత్వాన్ని చూపిస్తుంది. ఎడిటింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు.

ఇక యువ దర్శకుడు కౌశిక్ విషయానికి వస్తే.. తన మొదటి ప్రయత్నంను మెచ్చుకొవాలి. మంచి కథను ఎంచుకోడమే కాకుండా ఎమోషన్స్ రాబట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్రెడీ పెళ్లి ఏజ్ ఉన్న కొడుకు ఉన్న తల్లికి మళ్ళీ పెళ్లి చెయ్యడం అనే సున్నితమైన అంశాన్ని బాగా హ్యాండిల్ చెయ్యడం చాలా బాగుంది. కాకపోతే మెయిన్ లీడ్ మీద రాసుకున్న లవ్ స్టోరీని ఇంకా బెటర్ గా తీసి ఉంటే బాగుండేది. ఈ విషయంలో కథనం బాగా రాసుకొని ఉంటే బాగుండేది. అలాగే కొన్ని రొటీన్ సన్నివేశాలను తగ్గించి ఉండాల్సింది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ “చావు కబురు చల్లగా” లోని కనిపించే కథ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే కార్తికేయ సాలిడ్ పెర్ఫామెన్స్ లావణ్య త్రిపాఠి రోల్ అలాగే ఈ చిత్రంలో కీలక ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి కానీ కొన్ని రొటీన్ బోరింగ్ సన్నివేశాలు అక్కడక్కడా డల్ గా సాగే కథనం ఈ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. మరి ఈ చిత్రంపై మరీ అన్ని అంచనాలు పెట్టుకోకుండా అయితే ఈ వారాంతంలో ఒక ఛాయిస్ గా ఇది నిలుస్తుంది.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు