ఓటీటీ రివ్యూ : ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 – తెలుగు సిరీస్ (నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

ఓటీటీ రివ్యూ : ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 – తెలుగు సిరీస్ (నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

Published on Aug 28, 2022 9:10 PM IST
Delhi Crime Season 2 Station Movie Review

విడుదల తేదీ : ఆగస్టు 26, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు: షెఫాలీ షా, రసిక దుగల్, రాజేష్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్ మరియు ఇతరులు

దర్శకత్వం : తనూజ్ చోప్రా

నిర్మాతలు: చార్లీ కార్విన్, సిడ్నీ కిమ్మెల్, బ్రియాన్ కోర్న్‌రిచ్

సంగీత దర్శకుడు: సెయిరి టోర్జుస్సేన్

సినిమాటోగ్రఫీ: డేవిడ్ బోలెన్

ఎడిటర్: అంతరా లాహిరి

 

ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ సీజన్ 1 పై ప్రేక్షకుల్లో ఎటువంటి అంచనాలు లేవు. అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ కి గొప్ప స్పందన దక్కింది. పైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అనేక అవార్డులను కూడా అందుకుంది. సీజన్ 1 భారీ విజయంతో, మేకర్స్ సీజన్ 2ని ప్రారంభించారు. కాగా ఆగస్టు 26 నుండి సీజన్ 2 నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. మరి ఈ సీజన్ 2 ఎలా ఉందో చూద్దాం రండి.

 

కథ :

ఢిల్లీలో నివసించే ఓ వృద్ధ దంపతులు హత్య చేయపడతారు. దాంతో పోలీసులు ఆ వృద్ధ దంపతులు హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేపడతారు. అయితే, అంతలో మరో వృద్ధ జంట కూడా హత్యకు గురవుతుంది, పైగా ఈ వృద్ధ దంపతుల హత్యలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. అసలు ఈ హత్యలు చేస్తోంది ఎవరు ?, మురికివాడల్లో ఉండే అట్టడుగు వర్గాలకు చెందిన కొంతమందిని పోలీసులు ఎలా అనుమానించారు ?, చివరకు DCP వర్తిక చతుర్వేది ఈ హత్యలకు సంబంధించిన వారిని పట్టుకుందా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సీజన్ 2 గుడ్ స్క్రీన్‌ప్లేతో పూర్తిగా బెటర్ ఫీల్ తో నడిచింది. పోలీసు విచారణ ప్రక్రియ మొత్తం గంభీరంగా సాగుతూ ఆకట్టుకుంది. పైగా ప్లే లో ఎక్కువ సమయం వీక్షకులను సీన్స్ లోని టెన్షన్ కి కట్టిపడేస్తుంది. పోలీసు అధికారుల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ఉన్న సమస్యలను కూడా ఈ సీజన్ 2 లో చక్కగా ఎలివెట్ చేశారు. ముఖ్యంగా కొన్ని సబ్‌ప్లాట్‌లు ఈ సిరీస్‌కి తగినంత ఏమోషనల్ డెప్త్ ను పెంచాయి.

అలాగే ఈ సిరీస్ లో వెనుకబడిన గిరిజనులకు జరిగిన అన్యాయం గురించి కూడా బాగా చెప్పారు. ఈ క్రమంలో వచ్చే దృశ్యాలు ఇంట్రెస్టింగ్ గా, రివర్టింగ్‌గా ఉంటాయి. అదే సమయంలో ఆలోచింపజేస్తాయి కూడా. ఈ సిరీస్ లో కొన్ని ఊహించని సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయి. స్క్రిప్ట్ లో మంచి ఫీల్ తో పాటు డెప్త్ కూడా చాలా బాగుంది.

ఇక హంతకుల పాత్రలను చివరగా రివీల్ చేస్తూ బాగా చూపించారు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కచ్చితంగా షాక్‌కి గురిచేస్తాయి. అన్నిటికీ మించి ఈ సిరీస్ అంతటా ఎమోషనల్ అండ్ సస్పెన్స్ తీవ్రత బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. షెఫాలీ షా DCP పాత్రను పోషించారు. ఆమె తన ప్రదర్శనతో ఈ సిరీస్‌ లో బెస్ట్ నటనను ప్రదర్శించింది. ఆమెకు రసిక దుగల్ మరియు రాజేష్ తైలాంగ్ నుంచి కూడా మంచి మద్దతు లభించింది.

.
మైనస్ పాయింట్లు:

ఈ షో సీజన్ 1 అద్భుత విజయం సాధించడంతో.. ఈ సీజన్ 2 పై ఇంకా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో.. ఆ అంచనాలను ఈ సీజన్ 2 పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. అలాగే, హత్యల యొక్క భయంకరమైన స్వభావం గురించి చాలా వివరంగా చెప్పారు.

కానీ, ఆ నేరాలకు సంబంధించి కీలక సీన్స్ ను కొన్ని ఛాయాచిత్రాలతో మాత్రమే చిత్రీకరించారు. అలా కాకుండా నేరస్థుల యొక్క చర్యలను ఇంకా క్లారిటీగా చూపించినట్లు అయితే, ఈ సీజన్ 2 ఇంకా బెటర్ గా ఉండేది. అలాగే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగాయి.

 

సాంకేతిక విభాగం :

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకున్నాడు. హత్యల నేపథ్యంలో రూపొందించిన సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సీజన్ 2 కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన సిరీస్ లో నటించినందుకు షెఫాలీ షాని అభినందించాలి. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు:

మొత్తమ్మీద ఈ ఢిల్లీ క్రైమ్ సీజన్-2లో గుడ్ కంటెంట్ తో సాగే గ్రిప్పింగ్ మూమెంట్స్‌ ఉన్నాయి. అలాగే ఇంట్రస్టింగ్ ప్లే కూడా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెటర్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సీజన్ 2 నిలుస్తోంది. పటిష్టమైన స్క్రీన్‌ప్లే తో పాటు, స్టార్ తారాగణం నుండి అద్భుతమైన ప్రదర్శనలు, సిరీస్ లోని మంచి ఎమోషనల్ డెప్త్, మరియు చాలా ఆసక్తికరమైన పోలీసు ఇన్వెస్టిగేషన్ సీన్స్.. ఇలా ఈ సిరీస్ లో ఆకట్టుకున్నాయి. కానీ ఇది మొదటి సీజన్ వలె గొప్పగా లేదు. అలాగే కొన్ని సీన్స్ కూడా అంత గొప్పగా లేవు. అయినప్పటికీ, ఈ సీజన్ 2 ఆకట్టుకుంది

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు