ఆడియో సమీక్ష : దేనికయినా రెడీ – పెప్పిగా సాగే వినోదాత్మక ఆల్బం


మంచు విష్ణు ప్రధాన పాత్రలో రానున్న “దేనికయినా రెడి” చిత్రం దసరా విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రంలో కథానాయికగా హన్సిక కనిపించనుంది జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేకిన ఈ చిత్రాని చక్రి మరియు యువన్ సంయుక్తంగా సంగీతం అందించారు. ఇప్పుడు ఈ ఆల్బం ఎలా ఉందో చూద్దాం

1) పాట : నాలాగే నేనుంటాను

గాయకులు : శంకర్ మహదేవన్

సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

హీరో ఇంట్రడక్షన్ కి వచ్చే ఈ పాటను యువన్ శంకర్ రాజ స్వరపరిచారు. శంకర్ మహదేవన్ గాత్రం ఈ పాటలో మరింత ఊపుని తెచ్చిపెట్టింది. ఈ పాట టిపికల్ యువన్ పాటలా మంచి ఎనర్జీతో సాగుతుంది. రామ జోగయ్య శాస్త్రి గారి సాహిత్యం బాగుంది. మొత్తానికి మంచి ఇంట్రడక్షన్ పాట.

 

2)పాట : పిల్లందం కేక కేక

గాయకులు : హేమచంద్ర, పర్ణిక

సాహిత్యం :చంద్రబోస్

ఇది కదిలే ట్రైన్ లేదా రైల్వే స్టేషన్ లో సాగే పాటలా అనిపిస్తుంది. హేమ చంద్ర తన వాయిస్ తో పాటకు అద్భుతమయిన అనుభూతిని ఆపాదించాడు. చక్రి అందించిన సంగీతం ఈ పాటకు సరిపోయేలా ఉంది. ఇది వినోదాత్మకంగా చిత్రీకరించడానికి ఆస్కారం ఉన్న పాట.

3) పాట : నిన్ను చూడకుండా

గాయకులు : అద్నాన్ సమీ, గీత మధురి

సాహిత్యం : భాస్కర భట్ల

ఈ రొమాంటిక్ డ్యూయట్ లో ఇద్దరు ప్రతిభావంతులయిన గాయకులు అద్నాన్ సమీ మరియు గీత మధురి పాడారు. ఈ పాటకి కావలసిన ఎనర్జీ తో పాటు కావలసిన ఫీల్ ని కలిగించారు. చక్రి గతంలో చేసిన పాటను తలపించినా, పాట బాగుంది. మంచి అందమయిన ప్రదేశాలలో ఈ పాట చిత్రీకరణ ఉండవచ్చు. భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు.

 

4)పాట : పిల్ల నీవల్ల

గాయకులు : యువన్ శంకర్ రాజ, శ్రద్ద పండిట్

సాహిత్యం :అనంత శ్రీరామ్

పిల్ల నీవల్ల పాట సున్నితమయిన మెలోడి పాట. ఈ పాటను యువన్ శంకర్ రాజ స్వరపరిచారు. ఈ పాట నెమ్మదిగా అందరికి నచ్చుతుంది. అనంత శ్రీ రామ్ రచించిన సాహిత్యం మంచి ఫీల్ ని ఇస్తాయి. యువన్ శంకర్ రాజ మరియు శ్రద్ద పండిట్ వారి గొంతుతో పాటకు న్యాయం చేశారు మొత్తానికి బాగా ఎంజాయ్ చెయ్యగల పాట.

5) పాట : పంచె కట్టుకో

గాయకులు : టిప్పు,శ్రవణ భార్గవి

సాహిత్యం :భాస్కరభట్ల

పూర్తి మాస్ బీట్ తో సాగే మాస్ సాంగ్ ఇది. పాటలో ఫుల్ ఎనర్జీ ఉంటుంది భాస్కర భట్ల అందించిన సాహిత్యం చక్రి అందించిన సంగీతం పాటకి మంచి ఊపునిస్తాయి. ఈ పాటలో విష్ణు డాన్స్ బాగా చేస్తాడని అనుకుంటున్నా. మంచి చిత్రీకరణతో సరయిన సమయంలో వస్తే ఈ పాటా చాలా బాగుంటుంది.

 

తీర్పు:

“దేనికయినా రెడి” మంచి పెప్పి ఆల్బం. చక్రి మరియు యువన్ సంయుక్తంగా స్వరపరచిన ఈ ఆల్బంలో ఎవరికీ వారు వారి మార్క్ మ్యూజిక్ తో శ్రోతను ఆకట్టుకున్నారు. “నాలాగే నేనుంటాను”,”పిల్ల నీవల్ల” మరియు “పంచె కట్టుకో” పాటలు చాలా బాగున్నాయి.

అనువాదం రv

సంబంధిత సమాచారం :

More