లాక్ డౌన్ రివ్యూ : దియా కన్నడ చిత్రం(అమెజాన్ ప్రైమ్)

Published on May 13, 2020 5:11 pm IST

 

 

నటీనటులు: పృథ్వీ అంబార్, ధీక్షిత్, కుషీ

దర్శకత్వం: కె ఎస్ అశోక

నిర్మాత: డి కృష్ణ చైతన్య

సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్

ఛాయాగ్రహణం: విశాల్ విట్టల్, సౌరభ్ వాగ్మారే

 

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో మన నెక్స్ట్ మూవీ దియా. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఇటీవల విడుదలైన ఈ కన్నడ చిత్రాన్ని డైరెక్టర్ అశోక్ తెరకెక్కించారు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

 

కథాంశం ఏమిటీ?

దియా(ఖుషీ రవి) తన కాలేజ్ మేట్ అయిన రోహిత్(దీక్షిత్ శెట్టి ) అంటే మనసులో ఇష్టం పెంచుకుంటుంది. సడన్ గా రోహిత్ ఆ కాలేజ్ నుండి వెళ్ళిపోతాడు. ఐతే మూడేళ్ళ తరువాత రోహిత్ మళ్ళీ దియాకు కనిపిస్తాడు, వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కొన్ని సమస్యల కారణంగా దియా రోహిత్ తో బ్రేకప్ అయి, అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళకు దియా మరో హ్యాండ్ సమ్ ఫెల్లో ఆది(పృథ్వి అంబర్) ప్రేమలో పడుతుంది. సాఫీగా సాగుతున్న వీరి లవ్ స్టోరీలోకి దియా ఎక్స్ లవర్ రోహిత్ ఎంటర్ అవుతాడు. రోహిత్ రాకతో ఈ ముగ్గురు జీవితాలలో జరిగిన సంఘటనలు ఏమిటీ? చివరికి దియా ఎవరికి దక్కింది అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

దియా పాత్ర చేసిన ఖుషీ రవి ఈ సినిమా అన్నీ తానై నడిపించింది. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, రొమాంటిక్ సీన్స్ లో ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. సన్నివేశానికి తగ్గట్టుగా ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. ప్రధాన పాత్ర చేసిన ఖుషీ రవి సినిమా ఒక్కటే నడిపించేసింది. ఇక ఇద్దరు హీరోలు కూడా తమ పాత్ర పరిధిలో మంచి నటన కనబరిచారు.

ఇక సందర్భానుసారంగా వచ్చే ట్విస్ట్ లు మంచి అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరి ఊహకు అందకుండా షాక్ ఇస్తుంది . వన్ సైడ్ లవ్ కోణాన్ని చెప్పిన తీరు బాగుంది. బ్రేకప్ తరువాత మరొకరి ప్రేమలో పడడం అనేది చాలా కన్వెన్సింగ్ చెప్పారు.

 

ఏమి బాగోలేదు?
అలరించే ట్విస్టులు ఉన్నప్పటికీ ఇది ఒక సాధారణమైన కథ. ఇక సినిమా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత కొంచెం సినిమా అనాసక్తిగా ఉంటుంది.

 

చివరి మాటగా

ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ డ్రామాగా దియా మూవీ నిలిచిపోతుంది. అద్భుతమైన నటన, రొమాన్స్, ఎమోషన్స్ అన్ని కలగలిపి చక్కగా తెరకెక్కిన చిత్రం. కొంచెం నెమ్మదిగా సాగే కథనం మినహాయిస్తే దియా తప్పక చూడాల్సిన చిత్రం.

123telugu.com Rating : 3.5/5

సంబంధిత సమాచారం :

X
More