సమీక్ష : “ఫస్ట్ డే ఫస్ట్ షో” – డిజప్పాయింట్ చేసే కథ కథనాలు

సమీక్ష : “ఫస్ట్ డే ఫస్ట్ షో” – డిజప్పాయింట్ చేసే కథ కథనాలు

Published on Sep 3, 2022 3:02 AM IST
First Day First Show Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 02, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, శ్రీనివాస రెడ్డి

దర్శకులు : వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి

నిర్మాతలు: శ్రీజ ఏడిద, శ్రీరామ్ ఏడిద

సంగీత దర్శకుడు: రాధన్

సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అక్కిరెడ్డి

ఎడిటర్: గుళ్లపల్లి సాంబశివరావు

లేటెస్ట్ గా ఈ వారంలో రిలీజ్ రేస్ కి వచ్చిన మరో చిత్రం “ఫస్ట్ డే ఫస్ట్ షో”. జస్ట్ తక్కువ సమయంలోనే డీసెంట్ బజ్ ని సొంతం చేసుకొని ఈ వారం రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
 

కథ :

 

ఇక ఈ సినిమా కథలోకి వస్తే.. ఈ చిత్రం 2001 టైం లో సెట్ చేసి కనిపిస్తుంది. శ్రీనివాస్(శ్రీకాంత్ రెడ్డి) ఒక సింపుల్ కాలేజ్ స్టూడెంట్ కాగా అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ కూడా. అయితే, తాను లయ(సంచిత బసు) తన కాలేజ్ అమ్మాయిని ప్రేమిస్తాడు. తనని ఎలా అయినా కూడా అప్పుడు రిలీజ్ కాబోతున్న తన అభిమాన హీరో ఖుషి సినిమా కి ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకెళ్లి చూపించాలి. ఆ క్రమంలో ఆమె కూడా ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ అడగడంతో మరింత ఎగ్జైట్ అయ్యిన తాను పవన్ సినిమాకి ఆమెని తీసుకెళ్తాడా? తన ప్రేమని నెగ్గించుకోగల్గుతాడా అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
 

ప్లస్ పాయింట్స్ :

 

తన సినిమాతో మెప్పించిన అనుదీప్ కేవీ ఈ సినిమా కథ అందించి తన కామెడీ టైమింగ్ ని చూపిస్తాడు. వెన్నెల కిషోర్ పై ఉన్న కొన్ని కామెడీ సీన్స్ అయితే డీసెంట్ గా అనిపిస్తాయి. అలాగే ఈ సినిమా డైరెక్టర్ కూడా ఈ సినిమాలో చిన్న రోల్ చేయడం దానిని బాగా నటించడం కూడా మెప్పిస్తుంది.

ఇంకా నటుడు శ్రీకాంత్ రెడ్డి తన ఫస్ట్ సినిమా అయినా కూడా మెచ్యూర్ పెర్ఫామెన్స్ ని అయితే తాను కనబరిచాడు. అలాగే హీరోయిన్ సంచిత కూడా డీసెంట్ లుక్స్ తో తన రోల్ పరిధి మేరకు బాగానే చేసింది. అలాగే సీనియర్ నటులు తనికెళ్ళ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. ఇంకా పవన్ ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి వారికి అవి నచ్చొచ్చు..

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ ఏదన్న ఉంది అంటే సరైన కథ లేకపోవడమే అని చెప్పాలి. చాలా సింపుల్ ఆ ఉండే కథ పైగా మరింత సింపుల్ గా ఉండే కథనం సినిమాని పేలవంగా మార్చాయి. ఈ తరహా లైన్ లు షార్ట్ ఫిల్మ్స్ వరకు ఓకే కానీ ఒక ఫుల్ లెంగ్త్ సినిమాలా మాత్రం ఆకట్టుకునే విధంగా అనిపించవు..

పైగా స్ట్రాంగ్ లైన్ లేకపోయినా కథనం కూడా ఏమంత ఎంగేజింగ్ గా అనిపించదు. చాలా చోట్ల డల్ గా కనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల కామెడీ తో లాగే ప్రయాతం చేసారు కానీ అన్ని చోట్లా ఇది వర్కౌట్ అయ్యినట్టు అనిపించదు. ఇక ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం నడకలో కొనసాగుతుంది.

దీనితో ఆడియెన్స్ లో మరింత డిజప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. అలాగే జాతి రత్నాలు లాంటి సాలిడ్ కామెడీ హిట్ ఇచ్చిన అనుదీప్ కథతో తెరకెక్కిన సినిమా ఇది అని అదే రేంజ్ లో కామెడీ ఉంటుంది అనుకున్నవారికి కూడా నిరాశ తప్పదు.

 

సాంకేతిక వర్గం :

 

సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. రాధన్ సంగీతం బాగుంది అలాగే ప్రశాంత్ సినిమాటోగ్రఫీ సినిమా నేచర్ కి తగ్గట్టుగా నాచురల్ విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ అయితే సరిగ్గా చేయించాల్సి ఉంది. చాలా వరకు అనవసర సన్నివేశాలు ఉన్నాయి. ఇక దర్శకులు వంశీధర్ మరియు లక్ష్మి నారాయణలు అనుదీప్ స్టోరీ తో అలా వెళ్ళిపోయినట్టు ఉన్నారు అంతే చాలా సీన్స్ విషయంలో పునః పరిశీలన చేసుకొని దర్శకత్వం లోకి దిగాల్సింది.

 

తీర్పు :

 

ఇక మొత్తగా చూసినట్టు అయితే ఈ “ఫస్ట్ డే ఫస్ట్ షో” చిన్న హడావుడితో వచ్చినా పూర్తి స్థాయిలో సక్సెస్ సినిమాగా మాత్రం నిలవలేకపోతుంది. డెబ్యూ నటుల నటన వెన్నెల కిషోర్ పై అక్కడక్కడా కామెడీ తప్ప సినిమాలో పెద్దగా స్టోరీ లేదు సరైన కథనం లేకపోవడం వల్ల బోర్ ఫీల్ కలుగుతుందని చెప్పాలి.. వీటి మూలాన అయితే సినిమాకి అనుకున్న స్థాయి విజయం దక్కదు. ఈ వారాంతానికి అయితే ఈ సినిమాని మినహాయించవచ్చు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు