సమీక్ష : జిప్సి – బోర్ గా సాగే ట్రావెల్ అండ్ లవ్ డ్రామా !

Release date : July 17th, 2020

123telugu.com Rating : 2/5

నటీనటులు : జీవా, నటాషా సింగ్, లాల్ జోష్ తదితరులు

దర్శకత్వం : రాజు మురుగన్

నిర్మాత : అంబేద్ కుమార్

సంగీతం : సుశీల రామన్, సంతోష్ నారాయణన్

రంగం మూవీ ఫేమ్ జీవా హీరోగా రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన జిప్సి చిత్రం. అంబేద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో జీవా సరసన నటాషా సింగ్ జంటగా నటించింది. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని జూలై 17న తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదల చేశారు. మరి ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

 

జిప్సి (జీవా) పసిబిడ్డగా ఉన్నప్పుడే.. ఓ బాటసారి అతని బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. దేశం మొత్తం తిరిగే ఆ నిత్యబాటసారి.. జిప్సిని కూడా తనలాగే పెంచుతాడు. అలా ఆ ఇద్దరూ ఓ గుర్రం (జీవి)ని వెంటపెట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో వైహిదా (నటాషా సింగ్)ను చూడటం, మొదటి చూపులోనే ఇద్దరు మధ్య ఒక తెలియని ఆకర్షణ పుడుతుంది. అంతలో వైహిదాకి పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేని వైహిదా, జిప్సితో కలిసి లేచిపోతుంది.
ఆ తరువాత ఇద్దరూ ట్రావెల్ చేస్తూ.. హ్యాపీగా ఉంటారు. అంతలో వైహిదా నెల తప్పడం.. ఆమెకు డెలివరీకి టైం దగ్గర పడుతూ ఉన్నప్పుడు పెద్ద అల్లరులు జరుగుతాయి. ఆ తరువాత కొన్ని ఊహించని పరిణామాలతో జిప్సి, వైహిదా విడిపోతారు ? అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు ? దానికి గల కారకులు ఎవరు? వీరి బంధానికి ఉన్న అడ్డు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

హీరోగా జీవా ఇప్పటి వరకు చాలా సినిమాలనే చేసారు. కానీ తనకంటూ ‘రంగం’ తరువాత ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే సినిమాగా మాత్రం ఏ ఒక్కటీ అంత స్కోప్ తీసుకురాలేకపోయింది. కానీ ఈ చిత్రం మాత్రం జీవాలో నటన స్థాయిని పెంచింది. కొన్ని సీన్స్ బాగున్నాయి. ఆ ఇంపాక్ట్ ను ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్పాలి. ఇప్పటి వరకు స్టైలిష్ గా అనేక కోణాల్లో కనిపించిన జీవా ఈ చిత్రం ద్వారా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. తన నటన ఈ చిత్రానికి మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఒక ట్రావెలర్ పాత్రలో కనిపించి చిన్న చిన్న మ్యానరిజమ్స్ తో తాను కనబర్చిన నటనా తీరు చాలా బాగుంది. అలాగే పలు కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సినిమా చూసే ప్రేక్షకునికి కూడా ఆ ఫీల్ ను తీసుకొచ్చే విధంగా సినిమా మొత్తం తానే నడిపించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక హీరోయిన్ నటాషా సింగ్ కూడా మంచి నటనను కనబర్చింది. అలాగే సినిమా అంతా మంచి ఎమోషనల్ రోల్ లో కనిపించి తన చక్కని హావభావాలతో ఏ సీన్ కు ఎలా కావాలో అలా తనని తాను మలచుకున్న విధానం బాగుంది. పాటలు విజువల్ గా బాగున్నాయి. దీనిని దర్శకుడు బాగా ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన శివ కుమార్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే హీరోహీరోయిన్ల పాత్రలకు మధ్య వ్యతాస్యం ఆకట్టుకున్నా.. కథాకథనాల పరంగా మాత్రం సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. ఫేక్ ఎమోషన్స్ తో లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో సినిమా సాగింది. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. పైగా సెకెండ్ హాఫ్ మొత్తం హీరోహీరోయిన్లు మధ్య కొన్ని లవ్ సీన్స్ అనవసరంగా సాగతీశారు.

దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత మరి ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. కొత్తగా ఒక ఏరియాలోకి వచ్చి… పైగా గుర్రం నడుపుకునే కుర్రాడు, వాడికి క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడటం, చిన్న చిన్న మేలో డ్రామా ఇన్సిడెంట్ల కారణంగా ఆ ప్రేమను ఆ అమ్మాయి కూడా ఫీల్ అవ్వడం, వీటికి తోడు వీళ్ళద్దరూ ప్రేమకు విధి విలన్.. అతని వల్ల వీళ్ళ లవ్ స్టోరీలో సమస్యలు రావడం ఇలా బలం లేని సీన్స్ తో సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

అయితే ఈ సన్నివేశాల్లో కూడా దర్శకుడు కొన్ని చోట్ల మంచి ఎమోషన్ ను పండించాడు. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగానే ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల నిరాశ పరుస్తాడు. కంటెంట్ పరంగా ఇంకా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు సినిమాను సింపుల్ గా ముగించడం అంతగా రుచించదు.

 

సాంకేతిక విభాగం :

 

ముందుగా చెప్పుకున్నట్లుగానే దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అయితే ఆ కాన్సెప్ట్ ని తెర మీద చూపెట్టడంలో కొంత తడబాటు పడ్డాడు. అయినప్పటికీ కొన్ని ఎమోషన్ అండ్ లవ్ సీక్వెన్స్ లో మరియు క్లైమాక్స్ అండ్ కొన్ని కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. కెమెరామెన్ కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. సినిమాలో విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక సంగీత దర్శకులు అందించిన సంగీతం బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ఎడిటర్ గా పనిచేసిన వ్వ్యక్తి వర్క్ ఫర్వాలేదు.

 

తీర్పు :

 

‘జిప్సి’ అంటూ ట్రావెల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పరంగా మరియు క్లైమాక్స్ అలాగే కొన్నిచోట్ల డైలాగ్స్ అండ్ కీ సీన్స్ తో సినిమా అక్కడక్కడా బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగదు. కథనం సింపుల్ గా ఉండటం, సినిమాలో సరైన లాజిక్స్ లేకపోవడం, అన్నిటికి మించి సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అవ్వడం, సిల్లీ ఎమోషన్ తో చాలా సీన్స్ సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనుతలుగా నిలుస్తాయి. అయితే హీరోహీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్, అలాగే జీవా నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. అయితే ఈ లాక్ డౌన్ లో ప్రత్యేకంగా టైమ్ వేస్ట్ చేసుకుని ఈ సినిమాని చూడకపోవడమే బెటర్.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :

More