సమీక్ష : హ‌లో గురు ప్రేమ‌కోస‌మే – సరదాగా సాగిపోయే ఎమోషనల్ డ్రామా

Published on Oct 19, 2018 12:02 pm IST

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : రామ్ , అనుపమా పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్

దర్శకత్వం : త్రినాథరావు నక్కిన

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : విజయ్ కె చక్రవర్తి

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన చిత్రం హలో గురు ప్రేమకోసమే. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ :

సంజు ( రామ్ ) బీటెక్ పూర్తి చేసి హైద్రాబాద్లో ఉద్యోగం చేస్తూ వాళ్ళ అమ్మగారి స్నేహితుడైన విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) ఇంట్లో వుంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ ( అనుపమ పరమేశ్వరన్) చూసి ప్రేమలో పడతాడు. మరోవైపు సంజు సహోద్యోగి అయినా రీతూ (ప్రణీత ) కూడా సంజు ను ప్రేమిస్తుంది. ఇక విశ్వనాథ్ కార్తీక్ (నోయల్ ) తో తన కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. ఆ తరువాత ఆ పెళ్లి ఎలా క్యాన్సల్ అవుతుంది. విశ్వనాథ్ రామ్ – అనుపమ ల పెళ్ళికి ఒప్పుకుంటాడా ? అసలు రీతూ ఏమైంది? అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధానంగా మూడు పాత్రలు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. అవి సంజు ,అనుపమ , విశ్వనాథ్ పాత్రలు. ఇక సంజు పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమా అంత సెట్టిల్డ్ ఫర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. అను పాత్రలో నటించినా అనుపమా సీరియస్ పాత్రలో తన నటనతో మెప్పించింది.

ఇక ఎప్పటిలాగే తనకు అలవాటైన నటనతో ప్రకాష్ రాజ్ అలరించాడు. అమ్మాయికి తండ్రిగా ప్రేమించిన యువకుడికి ఫ్రెండ్ గా చక్కగా నటించారు. ఇక త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ ను ఎమోషన్స్ తో డీల్ చేసిన విధానం బాగుంది. రైటర్ ప్రసన్న కుమార్ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మెయిన్ మైనస్ అంటే రొటీన్ స్టోరీ అని చెప్పుకోవాలి. సినిమా ఊహించిన విధంగా ఉండడంతో వచ్చే ట్విస్ట్ లు కూడా ఆసక్తికరంగా అనిపించవు. ఇక రామ్ -ప్రణీత లవ్ ట్రాక్ కూడా సినిమాకు మరో మైనస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి.

ఇక సెకండ్ హాఫ్ లో ఓన్లీ రామ్ , ప్రకాష్ రాజ్ పాత్రల ఫై ఫోకస్ పెట్టడంతో హీరోయిన్ పాత్ర ఎలివేట్ కాలేకపోయింది. రామ్ – అనుపమ ల మధ్య వచ్చే లవ్ సన్నివేశాలను కూడా ఇంకొంచెం ఆసక్తికరంగా రాసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

కెప్టెన్ అఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్ ఫుట్ నుఇచ్చారు. రొటీన్ స్టోరీ అయినా ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించారు. కామెడీ ని ఎమోషన్స్ ను బ్యాలన్స్ చేసిన తీరు కూడా బాగుంది.

ఇక దేవి శ్రీ ప్రసాద్ నుండి ఆశించిన మ్యూజిక్ ఈచిత్రంలో ఉండదు. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియో ను అందించిన దేవి ఈ చిత్రం తో నిరాశ పరిచాడు. ఒక్క టైటిల్ సాంగ్ తప్ప మిగితావి గుర్తుండిపోవు. నేపథ్య సంగీతం ఓకే. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. విజయ్ కె చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలు జస్ట్ ఒకే అనిపిస్తాయి.

తీర్పు :

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం చాలాభాగం కామెడీతో.. కీలక సన్నివేశాల్లో ఎమోషన్ తో మరియు రామ్, ప్రకాష్ రాజ్ ల నటనతో చాలా వరకు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే సింపుల్ స్టోరీ కావడం, ఆ స్టొరీలో సరైన లవ్ ట్రాక్ కూడా లేకపోవడం.. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకు మైనస్ గా చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ చిత్రం ఫ్యామిలీ అడియన్స్ తో పాటు.. యూత్ ని కూడా ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :