సమీక్ష : “ఖిలాడి” – అక్కడక్కడా ఓకే అనిపించే క్రైమ్ డ్రామా

Khiladi Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్

దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు

సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు

ఎడిటర్ : అమర్ రెడ్డి


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి హీరోయిన్స్ గా రమేష్ వర్మ దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం “ఖిలాడి”. మంచి అంచనాలు నడుమ తెలుగు మరియు హిందీలో రిలీజ్ చేసిన ఈ చిత్రం ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. మహాత్మా గాంధీ (రవితేజ) తన ఫ్యామిలీ తో కలిసి సాధారణంగా జీవనం కొనసాగించే ఒక సాధారణ వ్యక్తి.. అయితే తన లైఫ్ లో ఊహించని విధంగా పది వేల కోట్ల స్కామ్ లో తాను ఇరుక్కొని జైలు పాలు అవుతాడు. మరి అతన్ని బయటకి తీసుకొచ్చేందుకు ఒక సైకాలజీ స్టూడెంట్ మీనాక్షి చౌదరి ప్రయత్నిస్తుంది. మరి ఈ క్రమంలో గాంధీ బయటకు వస్తాడు కానీ రావడంతోనే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇస్తాడు. మరి ఈ కథలో తాను ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? ఇంతకీ తాను ఆ స్కాం లో ఎలా ఇరుక్కుంటాడు? తనకి డింపుల్ హయాతికి సంబంధం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మాస్ మహారాజ్ తీసుకున్న అటెంప్ట్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి గతంలో కూడా తాను డ్యూయల్ రోల్స్ చేసినా ఈ సినిమాలో తన అటెంప్ట్ మాత్రం కాస్త కొత్తగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. పైగా దానిని రవితేజ కూడా అంతే సాలిడ్ గా ఎనర్జిటిక్ గా ప్రాజెక్ట్ చేసి రక్తి కట్టించారు. అయితే యాక్షన్ సీక్వెన్స్ లలో కానీ తన యాటిట్యూడ్ మేకోవర్ అంతా ఈ చిత్రంలో రవితేజ నుంచి ఆకట్టుకునే విధంగా కనిపిస్తాయి. టోటల్ గా అయితే రెండు వేరియేషన్స్ లో తన నుంచి ది బెస్ట్ వర్క్ ని రవితేజ ఇచ్చేసారు.

మరి అలాగే సినిమాలో కనిపించే ఇతర తారాగణంకి కూడా మంచి స్కోప్ లభించింది అని చెప్పాలి. మొదటగా హీరోయిన్ డింపుల్ హయాతి కోసం చెప్పుకున్నట్టు అయితే.. తన గ్లామ్ షో సినిమాలో ఒక బ్లాస్ట్ అని చెప్పాలి. కొన్ని చోట్ల డీసెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ మరికొన్ని చోట్ల తన గ్లామ్ షో తో ఆకట్టుకుంది. అలాగే రవితేజతో కెమిస్ట్రీ కూడా తన నుంచి వర్కౌట్ అయ్యింది.

అలాగే మరో హీరోయిన్ మీనాక్షి కి కూడా ఈ చిత్రంలో మంచి స్కోప్ దక్కింది. మొదటి నుంచి కీ రోల్ లోనే తాను కనిపిస్తుంది. దానిని ఆమె ఇంప్రెస్ చేసే విధంగా కంప్లీట్ చేసింది. అంతే కాకుండా తన గ్లామ్ షో కూడా సినిమాలో ఆకట్టుకుంటుంది. ఇక అనసూయ పాత్ర లిమిటెడ్ గానే ఉన్నా కొత్త మాడ్యులేషన్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ని ఆమె అందిస్తుంది.

ఇంకా వెన్నెల కిషోర్, మురళీ శర్మ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ అర్జున్ సర్జా కోసం చెప్పుకోవాలి. ఒక సీరియస్ కాప్ గా తన రోల్ లో సాలిడ్ గా కనిపిస్తారు. వీరితో పాటుగా సినిమాలో కనిపించే అక్కడక్కడా కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ బ్యాంగ్ లు సినిమాలో హైలైట్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రం స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఆడియెన్స్ లో మంచి థ్రిల్ అండ్ ఎగ్జైట్మెంట్ ని నెలకొల్పుతుంది. దీనితో హీరో పాత్రపై మరింత ఆసక్తి రేగుతుంది అయితే ఆ ఎగ్జైట్మెంట్ కి వేరే నరేషన్ ఇచ్చి దర్శకుడు కంప్లీట్ గా ఆకట్టుకోని విధంగా ప్రెజెంట్ చెయ్యడం బాగా నిరాశపరుస్తుంది. అలాగే సినిమాలో ట్విస్టులు ఉంటాయి కానీ అవేవి అంత ఎఫెక్టివ్ గా అనిపించవు.

మరి అలాగే హీరోకి అంటూ ఈ చిత్రంలో ఒక సెపరేట్ సిద్ధాంతం ఉంటుంది. కానీ అది ఈ చిత్రంలో అంతగా ఎలివేట్ అయ్యినట్టుగా ఎక్కడా కనిపించదు. ఏదైనా స్మార్ట్ గా చెయ్యాలి అనుకుంటాడు కానీ తన క్యారెక్టరైజేషన్ లో ఆ స్మార్ట్ నెస్ ఉండదు. అలాగే తర్వాత కి బోర్ కొట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి, ఇంకా ఎమోషన్స్ మిస్ ఫైర్ అయ్యాయి.

అలాగే రవితేజ మరియు అర్జున్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు ఉంటాయి అవి కూడా అంత బాగా ఎస్టాబ్లిష్ అయ్యినట్టు అనిపించవు. ఇక ఫైనల్ గా క్లైమాక్స్ అయితే ఒక ప్రశ్నార్ధకంగా అనిపిస్తుంది.. అంతా సో సో గా మారిపోయి సిల్లీగా అనిపిస్తుంది. ఒక సీక్వెల్ ని టీజ్ చేస్తున్నాం అంటే ఆ రేంజ్ లో స్క్రీన్ ప్లే క్లైమాక్స్ కి సెట్ చేసి ఉండాలి కానీ అది కంప్లీట్ గా మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రాన్ని మొదటి నుంచి రవితేజ కెరీర్ లోనే హై ఎండ్ వాల్యూస్ తో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అయితే అది విజువల్ గా కూడా అంతే స్థాయిలో కనిపిస్తుంది. నిర్మాతలు పెట్టిన ఖర్చుకి తగ్గ మంచి విజువల్స్ ని అయితే ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక టెక్నికల్ టీం లో మొట్ట మొదటి హైలైట్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం అని చెప్పాలి. తాను ఇచ్చిన సాంగ్స్ విజువల్ గా మరింత హిట్ గా కనిపిస్తాయి అలానే తన స్టైలిష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేసింది. ఇంకా సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణుల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా ఉండాల్సింది.

ఇక దర్శకుడు రమేష్ వర్మ విషయానికి వస్తే.. రమేష్ వర్మ తన డైరెక్షన్ పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక అందుకోలేకపోయారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ లో తన టేకింగ్ కంప్లీట్ గా బ్యాలన్స్ తప్పినట్టు అనిపిస్తుంది. ఏమాత్రం సీరియస్ నెస్ లేకుండా అసలు కాన్సెప్ట్ కి కనెక్ట్ లేని విధంగా తన నరేషన్ ని చూపించి నిరాశపరిచారు. కొన్ని ట్విస్టులు రివీల్ చేసిన విధానం బాగుంది కానీ ఓవరాల్ గా అయితే తన డైరెక్షన్ లో అంత ఎగ్జైట్మెంట్ కనిపించదు. క్లైమాక్స్ కూడా అంత బలంగా తాను ఎలివేట్ చెయ్యలేదు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే “ఖిలాడి” పెట్టుకున్న అంచనాలు మ్యాచ్ చేసే విధంగా అనిపించదు. రవితేజ పెర్ఫామెన్స్ సహా హీరోయిన్స్ గ్లామ్ షో లు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు ప్రీ ఇంటర్వెల్ లు మంచి ట్రీట్ ని ఇస్తాయి. కానీ సినిమాకి కీలకం అయ్యిన సెకండ్ హాఫ్, క్లైమాక్స్ లలో డైరెక్షన్ లోపం కనిపిస్తుంది. దీనితో వీటి మూలాన కాస్త దెబ్బపడింది. మరి వీటిని పక్కన పెడితే “ఖిలాడి” రవితేజ అభిమానులకి బాగా నచ్చొచ్చు కానీ మిగతా ఆడియెన్స్ కి స్ట్రిక్ట్ గా ఒక్కసారి చూడగలిగే సినిమా.

 

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

 

Click Here English Version

సంబంధిత సమాచారం :