సమీక్ష : లక్ష్మీ బాంబ్ – పాత రివెంజ్ డ్రామాలనే కలిపి తయారు చేశారు !

Lakshmi Bomb movie review

విడుదల తేదీ : మార్చి 10, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : కార్తికేయ గోపాలకృష్ణ

నిర్మాతలు : వెల్ల మౌనికా చంద్ర శేఖర్, ఉమా లక్ష్మి నరసింహ

సంగీతం : సునీల్ కశ్యప్

నటీనటులు : మంచు లక్ష్మి

చాలా కాలం గ్యాప్ తర్వాత లక్ష్మి మంచి నటించిన చిత్రం ‘లక్ష్మి బాంబ్’. టైటిల్ తోనే ఆకట్టుకుంటున్న ఈ చిత్రంలో లక్ష్మి జడ్జ్ పాత్ర పోషించింది. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సెషన్స్ కోర్ట్ జడ్జ్ అయిన లక్ష్మి (లక్ష్మి మంచు) అమ్మాయిలతో వ్యాపారం చేసే ఒక క్రిమినల్ (ప్రభాకర్) కు కఠిన శిక్షను విదిస్తుంది. దాంతో ఆమె మీద పగబట్టిన ఆ క్రిమినల్ తన గ్యాంగ్ తో కలిసి లక్ష్మిని చంపించేస్తాడు.

అలా చనిపోయిందనుకున్న లక్ష్మి ఊహించని విధంగా మళ్ళీ తిరిగొచ్చి ఆ క్రిమినల్స్ మీద పగ తీర్చుకుంటుంది. చనిపోయిందనుకున్న లక్ష్మి ఎలా తిరిగొచ్చింది ? తిరిగొచ్చిన లక్ష్మి జడ్జ్ లక్ష్మియేనా ? ఆమె ఆ క్రిమినల్స్ మీద ఎలా పగ తీర్చుకుంది ? అనేదే సినిమా…

ప్లస్ పాయింట్స్ :

సినిమకి అతి పెద్ద ప్లస్ పాయింట్ అంటే అది మంచు లక్ష్మి అనే చెప్పాలి. ఆమె తన నటనతో పాత్రకు, సినిమా కథనానికి సీరియస్ నెస్ తీసుకొచ్చింది ఆమె. మొదటి 20 నిముషాల సినిమా బాగుందనిపించింది. ఆ పార్ట్ లో లక్ష్మి తన ఎమోషన్స్ తో అద్భుతంగా నటించింది.

లక్ష్మి తల్లిదండ్రుల పాత్రల్లో పోసాని కృష్ణమురళి, హేమల నటన మెప్పించింది. ఫస్టాఫ్లో లక్ష్మికి, వారికి మధ్య నడిచే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు బాగా వచ్చాయి. కాలకేయ ప్రభాకర్ తన పాత్ర మేరకు బాగానే నటించి న్యాయం చేశాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమా కథ అసహజంగా అనిపిస్తూ కథనానికి ఏమాత్రం సింక్ అవకుండా ఉంది. కథలోకి ప్రవేశించే రెండవ లక్ష్మి పాత్ర ఎంట్రీ, ఆ పాత్ర నడిచిన తీరు మరీ ఓవర్ గా ఉన్నట్టు అనిపించింది. కొన్ని సన్నివేశాలైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ విసిగించాయి. జబర్దస్త్ రాకేష్, మిర్చి హేమంత్ ల కామెడీ ట్రాక్ అయితే మరీ దారుణంగా ఉంటూ సహనానికి పరీక్ష పెట్టింది.

సినిమాని దర్శకుడు నరేట్ చేసిన విధానం కూడా బాగోలేదు. పాత కథ అవడం, ఏమాత్రం ఆకట్టుకొని కథనం ఉండటం వలన బోరింగ్ ఫీల్ కలిగింది. మొదటి 15 నిముషాల తర్వాత సినిమా పరమ రొటీన్ రివెంజ్ కథగా మారిపోయి విసిగించింది.

సాంకేతిక విభాగం :

నిర్మాణ విలువలు కాస్త తక్కువ స్థాయిలో ఉండటం వలన సినిమా కొన్ని చోట్ల మరీ డల్ గా తోచింది. సంగీతం పర్వాలేదు. పైగా అది సినిమా కథనానికి ఏమాత్రం అడ్డు తగల్లేదు. ఎడిటింగ్ పర్వాలేదు. స్క్రీన్ ప్లే బాగోలేదు. కథను వివరించిన తీరు ఆడియన్సును కన్ఫ్యూజన్ కు గురి చేసేదిగా ఉంది. దర్శకుడు కార్తికేయ ఎంచుకున్న కథ, దాన్ని తెర మీద చూపిన విధానం రెండూ అసహజంగా అనిపించాయి.

తీర్పు :

మంచు లక్ష్మి నటించిన ఈ ‘లక్ష్మి బాంబ్’ చిత్రం పాత రివెంజ్ డ్రామాలన్నింటినీ కలిపి తయారు చేసిన రివేంజ్ డ్రామా. కాస్త బాగుందనిపించే మొదటి 20 నిముషాలు, ప్రధాన పాత్ర పోషించిన లక్ష్మీ మంచు నటన ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం ఆకట్టుకోని, అసహజంగా తోచే కథ, కథనాలు, దర్శకుడు కథను డీల్ చేసిన విధానం ఇందులో మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షిణించడం కన్నా టీవీల్లో ప్రసారం చేసినప్పుడు చూడోచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :