లాక్ డౌన్ రివ్యూ : ‘లూజర్’ (జీ5)

Published on May 16, 2020 3:48 pm IST

నటీనటులు : ప్రియదర్శి, కల్పిక, శశాంక్, తదితరులు

డైరెక్టర్ : అభిలాష్ రెడ్డి

నిర్మాతలు : జీ5, అన్నపూర్ణ స్టూడియో

 

 

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన వెబ్ సిరీస్ ‘లూజర్’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. మూడు టైం జోన్స్ లో వచ్చిన ఈ సిరీస్ ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం

 

కథా నేపథ్యం :

లూజర్ మూడు నేపథ్యాల్లో సాగుతుంది. 2007, 1995, మరియు 1985 ఇలా మూడు వేర్వేరు టైం జోన్స్ లో ముగ్గురి కథలు.. ఒక కథకు మరో కథకు కనెక్టివిటీతో సాగుతుంది ఈ సిరీస్. 2007 టైం జోన్ కథ సూరి యాదవ్ (ప్రియదర్శి) ఎయిర్ రైఫిల్ షూటర్ గా తన రాష్ట్ర జట్టులో చేరడమే అతని లక్ష్యం. ఇక 1995 టైం జోన్ విషయానికి వస్తే రుహి (అన్నీ, కల్పికా) చాలా సనాతన ముస్లిం కుటుంబానికి చెందిన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఆమె తన రంగంలో గొప్పగా సాధించాలని అనుకుంటారు. అలాగే 1985 సంవత్సరంలో, విల్సన్ (శశాంక్) భారత క్రికెట్ జట్టులో స్థానాన్ని కోరుకునే ఒక రంజీ ఫ్లేయర్. ఇలా ప్రతి ఒక్కరూ తమ సొంత రంగంలో గొప్పగా రాణించడానికి చాలా కష్టపడతారు. మరి ఈ కథలన్నీ ఎలా అనుసంధానించబడి ఉన్నాయి ? ఎలా సాగాయి ? నిర్ణీత సమయంలో వారికి ఏమి జరుగుతుంది ? మధ్యలో ఈ కథలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి ? అనేది మిగతా కథ.

 

ఏం బాగుంది :

దర్శకుడు అభిలాష్ రెడ్డి రాసిన కథ మొదట మనల్ని ఆకట్టుకుంటుంది. అతను ఈ వెబ్ సిరీస్‌ను మూడు టైమ్ జోన్‌లలో అందంగా సెట్ చేశాడు. మరియు ప్రతి కథలో బలమైన సంఘర్షణ,
లోతైన భావోద్వేగాలు బాగున్నాయి. ఈ సిరీస్ ఒక విశ్వసనీయతతో సాగుతుంది. ఏదైనా చిత్రం లేదా వెబ్ సిరీస్‌లో, ప్రధాన తారాగణం మాత్రమే మంచి పాత్రలను పొందుతుంది, అయితే లూజర్ లో మాత్రం, ప్రతి పాత్ర అద్భుతంగా వ్రాయబడి సమాన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

ప్రియదర్శి ఆల్ రౌండర్‌గా మారుతున్నాడు, సూరి యాదవ్‌ పాత్రలో అద్భుతంగా నటించాడు. నిస్సహాయ క్రీడాకారుడిగా అతను తన పాత్రను పోషిస్తున్న విధానం చూడటానికి చాలా బాగుంది. తన సోదరుడితో మరియు అతని స్నేహితురాలితో సాగే సన్నివేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. వెబ్ సిరీస్‌లో ప్రదర్శించబడిన మహిళా సాధికారత కోణం చాలా బలంగా ఉంది. కోమలీ ప్రసాద్ కూడా తన పాత్రలో అద్భుతంగా ఉంది మరియు ఆమె భావోద్వేగ వ్యక్తీకరణలు చాలా బాగున్నాయి.

శశాంక్ తన పాత్రలో చాలా వెరీయేషన్స్ చూపించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మరియు ఎమోషన్స్ అన్నీ తన పాత్రకు తగినట్లుగా చేశాడు. చివరగా, కల్పిక గణేష్ కూడా రుహిగా బాగుంది. ఆమె కూడా తీవ్రమైన పాత్రలో బాగా రాణించింది. తన భర్తతో ఎమోషన్ నిండిన అన్ని సన్నివేశాల్లో కల్పిక అద్భుతంగా నటించింది. పావని గంగీ రెడ్డి కూడా తన పాత్రలో అద్భుతంగా ఉంది. అన్ని కథలకు కనెక్షన్లు అద్భుతంగా ఉన్నాయి.

 

 

ఏం బాగాలేదు :

ఈ చిత్రం కథ చాలా సరళమైనది మరియు కథ భిన్నంగా ఉన్నప్పటికీ జెర్సీ యొక్క ఆనవాళ్ళు కనిపిస్తాయి. అలాగే, ఏడవ మరియు ఎనిమిది ఎపిసోడ్లలో ట్రీట్మెంట్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కల్పిక ముస్లిం భర్త తన భార్యతో ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాడనే దాని పై స్పష్టత లేదు.

 

చివరి మాటగా :

మొత్తంమీద, ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ఉత్తమ వెబ్ సిరీస్‌ల్లో లూజర్ ఒకటి. బలమైన భావోద్వేగాలతో సాగుతూ పాత్రల మధ్య వచ్చే డీసెంట్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటుంది. మెయిన్ గా ఈ సిరీస్ కొన్ని ఉత్తమ ప్రదర్శనలతో మంచి కంటెంట్ ను కలిగి ఉంది. మొత్తం పది ఎపిసోడ్లు అభిలాష్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ లాక్ డౌన్ లో ఈ సిరీస్ ను హ్యాపీగా చూడొచ్చు.

 

Rating: 3.5/5

సంబంధిత సమాచారం :

More