సమీక్ష : “లవ్ లైఫ్ & పకోడీ” – డల్ గా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్

సమీక్ష : “లవ్ లైఫ్ & పకోడీ” – డల్ గా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్

Published on Mar 12, 2021 2:11 PM IST
LoveLifeAndPakodi movie review

విడుదల తేదీ : మార్చి 12, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : బిమల్ కార్తీక్, సంచిత పూనచ

దర్శకత్వం : జయంత్ గాలి

నిర్మాత‌లు : జయంత్ గాలి

సంగీతం : పవన్

సినిమాటోగ్రఫీ : సాగర్ వై.వి.వి, జితిన్ మోహన్

ఎడిటింగ్ : శ్రావన్ కటికనేని

ఇటీవల ట్రైలర్ తో వచ్చి కాస్త ఫ్రెష్ ఫీల్ ను ఇచ్చిన చిన్నపాటి చిత్రాల్లో “లవ్ లైఫ్ & పకోడీ” కూడా ఒకటి. యంగ్ టాలెంట్ ను ఎపుడూ ప్రోత్సహించే నిర్మాత మధుర శ్రీధర్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఈరోజే విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

అరుణ్(బిమల్ కార్తీక్) అలాగే రెయా(సంచిత పూనచ) ఇద్దరు బెంగళూర్ లో తమ తమ లైఫ్ లను సాఫీగా కొనసాగించే యువతీ యువకులు. అయితే రెయా కు తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాక అరుణ్ ని కలుస్తుంది. అక్కడ నుంచి వీరిద్దరూ స్నేహితులుగా మారుతారు కానీ ఓ అఫైర్ మూలాన విడిపోతారు. సరే ఇదంతా అయ్యిన కొన్నాళ్ళకి మళ్ళీ అరుణ్ రెయా కు ప్రపోజ్ చేస్తాడు ఆమె ఒప్పుకుంటుంది కానీ పెళ్ళికి మాత్రం నో అంటుంది.. మరి ఈ పరిస్థితిని అరుణ్ ఎలా సాల్వ్ చేసుకుంటాడు?ఆమె ఒప్పుకుందా లేదా అన్నదే అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటగా సినిమాలో మెయిన్ లీడ్ కోసం మాట్లాడుకున్నట్టయితే హీరో బిమల్ మంచి నటనను కనబరిచాడు. చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ తో సెటిల్డ్ పెర్ఫామెన్స్ ను ఇచ్చాడు అలాగే హీరోయిన్ సంచిత కూడా మంచి రోల్ కనిపించింది. తనకిచ్చిన రోల్ బోల్డ్ దే అయినప్పటికీ అందులో చాలా కాన్ఫిడెన్స్ గా కనిపించింది. అంతే కాకుండా ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో మంచి ఎమోషన్స్ ను కూడా పండించింది.

వీటితో పాటుగా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేటి తరంలో యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీర్చిదిద్దడం. ఈరోజుల్లో యూత్ తమ రిలేషన్స్ లో ఎలా ఉంటున్నారు? పెళ్లి ప్రేమలపై వారికున్న అభిప్రాయాలను సూటిగా ఆహ్లాదంగా చూపిన విధానం బాగుంది. అలాగే ఈ చిత్రంలో డైలాగ్స్ నీట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంకా సినిమా మొత్తం చూసాక సెకండాఫ్ కాస్త బెటర్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

మొదటగా ఇలాంటి సినిమాల్లో డీటెయిల్స్ అనేవి చాలా కీలకం కానీ అవేవి ఈ చిత్రంలో పెద్దగా కనిపించవు ఎక్కడా అనిపించవు. అంతే కాకుండా ఇలాంటి చిత్రాల్లో ఫన్ నరేషన్ ఉంటే మరింత ఆహ్లాదంగా అనిపిస్తుంది కానీ ఆ అంశాలు కూడా మిస్సయ్యాయి. ఫస్ట్ హాఫ్ కూడా బాగా బోరింగ్ గా అనిపిస్తుంది.

అలాగే హీరో రోల్ కూడా కాస్త డల్ గా అనిపిస్తుంది. దాన్ని ఇంకా ఇంట్రస్టింగ్ గా మలచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు చూపించలేదు, పైగా అతని రోల్ కి మరియు హీరోయిన్ కి నరేషన్ ను తినేసే సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అవి ఒకింత బోరింగ్ గా అనిపిస్తాయి.

సినిమా అంతా ఎక్కువ ఇంగ్లీష్ డైలాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా అన్ని వర్గాలకు ఈ సినిమా రీచ్ అయ్యే అవకాశం కోల్పోయింది వాటిని తెలుగులోనే ఉంచాల్సింది. అలాగే వీరి మధ్యనే ఎమోషన్స్ ఇంకా స్ట్రాంగ్ గా చూపించి ఉంటే వీరి మధ్య కెమిస్ట్రీ ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో టెక్నికల్ విభాగం నుంచి డీసెంట్ అవుట్ పుట్ ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా కెమెరా వర్క్ ప్లెసెంట్ గా నాచురల్ గా అనిపిస్తుంది. అలాగే ముందే చెప్పినట్టుగా డైలాగ్స్ బాగున్నాయి. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. కానీ ఎడిటింగ్ వర్క్ మాత్రం ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది.

ఇక దర్శకుడు జయంత్ విషయానికి వస్తే..లేటెస్ట్ ట్రెండ్ లో తాను ఎంచుకున్న ఈ కథాంశం కొత్తగా అనిపిస్తుంది కానీ దీనిని ఆసక్తికర నరేషన్ తో మలచి ఉంటే బాగుండేది. అక్కడక్కడా కామెడీ రొమాన్స్ అంతా బాగా డిజైన్ చేసారు కానీ పర్ఫెక్ట్ గా అనిపించదు. పైగా స్లోగా ఉన్న నరేషన్ ఇంకాస్త స్పీడప్ చేసి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది.

 

తీర్పు :

 

ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే ఈ “లవ్ లైఫ్ & పకోడీ”లో లైన్ డీసెంట్ గా ఉంటుంది అలాగే నటీ నటుల నుంచి ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ లు బాగుంటాయి కానీ సరైన ఎమోషన్స్ లేకపోవడం నెమ్మదిగా సాగే నరేషన్, బోర్ గా ఉండే ఫస్ట్ హాఫ్ ఈ రోమ్ కామ్ ఎంటర్టైనర్ ను ఆసక్తిగా చూపించవు వీటిని దర్శకుడు ఇంకా ఆసక్తిగా మలచి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా మాత్రం ఈ చిత్రం ఓ డల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు