సమీక్ష : మామా మశ్చీంద్ర – స్లోగా సాగే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా!

సమీక్ష : మామా మశ్చీంద్ర – స్లోగా సాగే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా!

Published on Oct 7, 2023 3:03 AM IST
Mama Mascheendra Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 06, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సుధీర్ బాబు, మృణాళిని రవి, ఈషా రెబ్బా, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ అజయ్ తదితరులు.

దర్శకుడు : హర్షవర్ధన్

నిర్మాత: సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు

సంగీతం: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: పి.జి విందా

ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సుధీర్ బాబు హీరోగా రచయిత..దర్శకుడు హర్షవర్ధన్ రూపొందించిన సినిమా మామా మశ్చీంద్ర. కాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

పరుశురాం (సుధీర్ బాబు) తన చిన్నతనంలోనే తన తండ్రి చేతిలోనే అన్యాయానికి గురి అవుతాడు. అలాగే తన మేనమామ (అజయ్) చేతిలో కూడా మోసపోతాడు. ఈ క్రమంలో పూర్తిగా మారిపోయిన పరుశురాం జీవితంలోకి అతని ఇద్దరు మేనల్లుళ్లు దుర్గ – డీజే లు (సుధీర్ బాబు) ఎంటర్ అవుతారు. పరుశురాం కూతుళ్లు ఇద్దరూ వారిద్దరి వలలో పడి పోవడంతో పరుశురాం ఏం చేశాడు?, అసలు గతంలో మేనమామకు – మేనల్లుళ్ళకు మధ్య జరిగిన సంఘటన ఏమిటి?, ఎందుకు పరుశురాం తన వాళ్ళనే చంపాలనుకుంటాడు ?, ఇంతకీ దుర్గ – డీజే లు ఒకరా?, ఇద్దరా? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

సుధీర్ బాబు గత చిత్రాలు కంటే భిన్నంగా వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో మూడు పాత్రల్లో సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. సుధీర్ బాబు తన స్టైలిష్ లుక్స్ తో అండ్ తన గ్రేస్ యాక్షన్ తో అదరగొట్టాడు. అన్నిటికీ మించి సుధీర్ బాబు లావు క్యారెక్టర్ లో చాలా ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా పరుశురామ్ గా సుధీర్ బాబు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక క్లైమాక్స్ లో నడిచే యాక్షన్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. మెయిన్ గా సుధీర్ బాబు త్రిపాత్రాభినయం సినిమాకి ప్లస్ అయ్యింది.

రచయిత..దర్శకుడు హర్షవర్ధన్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. హీరోయిన్ ఈషా రెబ్బా బాగానే నటించింది. బోల్డ్ గా కనిపించడానికి బాగానే కసరత్తులు చేసింది. మరో హీరోయిన్ మృణాళిని రవి నటన కూడా చాలా బాగుంది. నటుడిగా హర్షవర్ధన్ మెప్పించారు. అలాగే అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తమ్మీద సుధీర్ బాబు నటుడిగా బాగా ఆకట్టుకున్నాడు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ మామా మశ్చీంద్ర సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ గా, రొటీన్ గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక ఒకేలా పోలికలు ఉన్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించి ఈ సినిమాలో చూపించిన ట్రాక్స్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాల్సింది. స్థూలకాయుడు దుర్గ పాత్ర ముగింపును కొంచెం బాగా చూపించాల్సింది.

దుర్గ పాత్రలోనే ట్విస్ట్ పెట్టినప్పుడు ఆ పాత్ర ఎండింగ్ ను అంతే ఇంట్రెస్టింగ్ గా ఎండ్ చేయాల్సింది. అన్నట్టు పరశురామ్ పాత్ర యొక్క గ్రాఫ్ లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అయితే, సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా ఫస్ట్ హాఫ్ కూడా పెద్దగా ఎంటర్ టైన్ గా సాగదు. హీరోయిన్ పాత్ర ఏది బలంగా అనిపించదు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు హర్షవర్ధన్ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ.. దర్శకుడు చెప్పాలనుకున్న కథలో డెప్త్ లేదు. పైగా సినిమాని ఇంట్రెస్ట్ గా మలచలేకపోయాడు. ఇక సంగీతం విషయానికి వస్తే..
చైతన్ భరద్వాజ్ నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పి.జి విందా పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ ను ఆయన చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాణ విలువ‌లు కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

వినూత్న పాత్రలతో పాటు సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన ఈ ‘మామా మశ్చీంద్ర’ లో.. తన స్టైలిష్ యాక్టింగ్ తో అండ్ యాక్టింగ్ లో తన వేరియేషన్స్ తో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. అయితే, కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల బోర్ కొట్టడం, చాలా సీన్స్ బాగా స్లో నెరేషన్ తో సాగడం, అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో సుధీర్ బాబు నటన బాగున్నా .. ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు