సమీక్ష : మంత్ర 2 – హర్రర్ లేదు, థ్రిల్స్ కూడా లేవు.!

mantra-2-review

విడుదల తేదీ : 31 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : ఎస్.వి సతీష్

నిర్మాత : శౌరి రెడ్డి – యాదగిరి రెడ్డి

సంగీతం : సునీల్ కశ్యప్

నటీనటులు : ఛార్మీ, చేతన్ చీను..

టాలీవుడ్ హాట్ బ్యూటీ ఛార్మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ‘మంత్ర’. ఈ సినిమాకి సీక్వెల్ గా కెవి సతీష్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘మంత్ర 2’. ఇందులో కూడా ఛార్మీనే మంత్రగా కనిపించింది. శౌరి రెడ్డి – యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీక్వెల్ సూపర్ హిట్ మంత్రని మైమరపించేలా ఉందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

మంత్ర(ఛార్మీ)కి హైదరబాద్ లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ గా జాబ్ రావడంతో హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ తను ఒక ఓల్డ్ కపుల్ ఉన్న ఇంట్లో గెస్ట్ గా ఉంటూ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైములో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనని చంపడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడే కథలోకి పోలీస్ ఆఫీసర్ విజయ్ (చేతన్ చీను) ఎంటర్ అవుతాడు. మంత్రని చంపడానికి ట్రై చేస్తుంది ఎవరా అనేదానిపై ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.

అందులో భాగంగానే విజయ్ మరో నలుగురుతో కలిసి మంత్ర ఉండే ఇంటికి వెళతారు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచీ వాళ్లకి షాకింగ్ న్యూస్ లు తెలుస్తుండడమే కాకుండా ఒక్కొక్కరు చంపబడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటి.? అలాగే వాళ్ళందరూ ఎందుకు చంపబడ్డారు.? అసలు మంత్ర ఎవరు.? మంత్రకి ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోండి.

ప్లస్ పాయింట్స్ :

చార్మింగ్ గర్ల్ ఛార్మీ చేసిన పెర్ఫార్మన్స్ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. మంత్ర 2 సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చార్మీ. మొదటి పాటలో ఛార్మీ తన అందంతో ఆకట్టుకుంది. కథ మొత్తం ఛార్మీ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో చార్మీ చూపిన హావభావాలు చాలా బాగున్నాయి. తనికెళ్ళ భరణి పెర్ఫార్మన్స్ బాగుంది, తన పాత్రే కథలో మంచి ఆసక్తిని తీసుకువస్తుంది.

హీరోగా చేసిన చేతన్ చీను చూడటానికి హన్డ్సం గా ఉన్నాడు. ఇంకాస్త మంచి ఆఫర్స్ వస్తే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకుంటాడు. ఛార్మీకి మంచి సపోర్ట్ గా నిలిచాడు. మొదటి ఐదు పది నిమిషాల్లో వచ్చే థ్రిల్స్ ని చాలా బాగా షూట్ చేసారు. అలాగే చివరి 5 నిమిషాలలో వచ్చే ఎమోషన్స్ ని బాగా చూపించారు.

మైనస్ పాయింట్స్ :

మంత్ర 2 అనేది మొదటి సినిమా అంచనాలను అస్సలు అందుకోలేకపోయింది. అంతే కాకుండా ఓరిజినల్ పేరుని చెడగోట్టేలా ఉందని చెప్పవచ్చు. స్టొరీ పరవాలేధనిపించినా నేరేషన్ మాత్రం చాలా వీక్ అని చెప్పాలి. దానికి తోడు డైరెక్టర్ ఒకే సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ని టచ్ చెయ్యాలనే ఉద్దేశంతో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో అసలు కథ అనేది మొదలు కాదు, దానికి తోడు సినిమా మొత్తం డ్రాగ్ అవుతూ ఉంటుంది.

సెకండాఫ్ లోనే ఈ సినిమా కథని రివీల్ సెహ్యడం మొదలు పెడతాడు. కానీ హర్రర్ ఎలిమెంట్స్ లేకపోవడం ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది. సినిమాలో చూపించే కొన్ని మరణాలు ఆడియన్స్ లో సస్పెన్స్ మరియు ఆసక్తిని క్రియేట్ చెయ్యలేకపోయాయి. ఇదొక హర్రర్ థ్రిల్లర్ సినిమా కానీ ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా ఊహించేస్తారు. సినిమా మొత్తం చాలా ఊహాజనితంగా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో ఉంది ఒకే ఒక్క పాట అయినా దాని చాలా బాగా షూట్ చేసారు. కెమెరా వర్క్ బాగుంది. సినిమాలో కూడా ఇచ్చిన లొకేషన్స్ ని బాగా ఉపయోగించుకొని హర్రర్ సినిమా అనే ఫీలింగ్ ని కలిగించాడు సినిమాటోగ్రాఫర్. ఇక హర్రర్ సినిమాలకు హార్ట్ అని చెప్పుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతబాగా లేదు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ బాగా లౌడ్ గా ఉందే తప్ప పెద్దగా సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఎడిటింగ్ బిలో యావరేజ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ని చాలా చాలా ఎడిట్ చేయవచ్చు.

ఎస్.వి సతీష్ ఎంచుకున్న కథలో పెద్దగా కిక్ లేకపోవడం, స్క్రీన్ ప్లే బాగాలేకపోవడం ఈ సినిమాని మరింత బోరింగ్ గా చేస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ – క్లైమాక్స్ లని సరిగా రాసుకోలేదు, తీయలేదు. నేరేషన్ సరిగా లేకపోవడం వలన చాలా సార్లు చూసే ఆడియన్ సినిమా నుంచి బయటకి వచ్చేస్తాడు. డైరెక్టర్ గా కూడా ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి.

తీర్పు :

సూపర్ హిట్ ఫిల్మ్ ‘మంత్ర’ కి సీక్వెల్ గా వచ్చిన ‘మంత్ర 2’ సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోవడమే కాకుండా ఆడియన్స్ ని నిరుత్సాహపరిచింది. మంత్ర లో చేసిన హాట్ బ్యూటీ ఛార్మీ ఇందులో నటించడమే ఈ సినిమాకి సినిమాకి పెద్ద ప్లస్. హర్రర్ థ్రిల్లర్ లో ఉండాల్సిన కనీస హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఇందులో లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ అయితే, కథ – కథనాలు కూడా చాలా వీక్ గా ఉండడం వలన సినిమా మరింత బోర్ కొట్టేస్తుంది. మంత్ర బ్రాండ్ చూసి థియేటర్స్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నిరుత్సాహంతోనే బయటకి వస్తారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :