సమీక్ష : నువ్వలా నేనిలా – సాగదీసిన బోరింగ్ లవ్ స్టొరీ.!

Nuvvala-Nenila-Movie-review విడుదల తేదీ : 08 ఆగష్టు 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : త్రినాధరావు నక్కిన
నిర్మాత : ఇందూరి రాజశేఖర్ రెడ్డి
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : వరుణ్ సందేశ్, పూర్ణ..

కమర్షియల్ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న యంగ్ హీరోస్ లో వరుణ్ సదేశ్ కూడా ఒకరు. హిట్ కోసం వరుసగా సినిమాలు చేస్తున్న వరుణ్ సందేశ్ కి హిట్స్ మాత్రం రావడం లేదు. వరుణ్ సందేశ్ హీరోగా పూర్ణ హీరోయిన్ గా నటించిన ‘నువ్వలా నేనిలా’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రినాధరావు నక్కిన దర్శకతం వహించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. వరుణ్ సందేశ్ ఎంతగానో ఎదురు చూస్తున్న హిట్ నువ్వలా నేనిలా ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

క్రిష్(వరుణ్ సందేశ్) చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న నష్టాల్లో ఉన్న తన కంపెనీని అమ్మేసి ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్ళిపోతాడు. క్రిష్ పెద్దయ్యాక వాళ్ళ నాన్న అమ్మేసిన కంపెనీని తిరిగి దక్కించుకోవాలని ఇండియాకి వస్తాడు. క్రిష్ కంపెనీలో పనిచేస్తున్న మహి అలియాస్ మహాలక్ష్మి(పూర్ణ)తో బాగా క్లోజ్ అవుతాడు. ఒకరికి ఒకరు తెలియకుండానే ప్రేమలో పడతారు. కానీ ఆ విషయాన్ని వారు గ్రహించరు..

వారిద్దరూ తెలుసుకునే టైంకి గతంలో మహి గోపి(శ్రీధర్)ని ప్రేమించి ఉంటుంది, అలాగే క్రిష్ జెన్నిఫర్(సోనియా బిర్జి)ని లవ్ చేసి ఉంటాడు. క్రిష్ – మహిలకి ఒకరి గతం ఒకరికి తెలిసాక ఏం జరిగింది? చివరికి క్రిష్ – మహి కలిసారా? లేదా? అలాగే క్రిష్ అనుకున్న కంపెనీని కొని తన తండ్రి కోరిక తీర్చాడా లేదా అన్నది? మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది హీరోయిన్ పెర్ఫార్మన్స్. ఎందుకంటే హీరో కంటే ఎకువగా కథ మొత్తం పూర్ణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పూర్ణ తనకిచ్చిన పాత్రలకి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, తాగేసి అల్లరి చేసే సీన్స్ చాలా బాగా చేసింది. పెర్ఫార్మన్స్ పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకులను మెప్పించింది.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్, అలాగే కొన్ని సీన్స్ లో సందర్భానుసారంగా వచ్చే కామెడీ బాగుంది. ఉత్తేజ్, శ్రీధర్, సోనియా బిర్జి తమ పాత్రలకు న్యాయం చేసారు. పాటలు బాగున్నాయి, అలాగే వాటిని షూట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సాయి కార్తీక్ మ్యూజిక్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ ప్లే.. స్క్రీన్ ప్లే లో అస్సలు వేగం లేదు.. సినిమా చాలా స్లోగా స్టార్ అవుతుంది. అంతే స్లోగా ముందుకు పోతూ అంతకన్నా స్లో అవుతూ వస్తుంది. దానికి తోడు ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలను మన వాళ్ళు ఇప్పటికే చాలా సార్లు చూసేయడం వలన సీన్ టు సీన్ ఏం జరుగుతుందో చెప్పేయగలరు. ఈ సినిమా కథ కూడా సౌత్ కొరియాలో వచ్చిన ‘సెడ్యూస్ మిస్టర్ పర్ఫెక్ట్’ కి కాపీ..సరే కాపీ కొట్టినా పర్లేదు.. సినేమామొట్టం చాలా ఎమోషనల్ గా ఉండాలి, కానీ ఆ ఎమోషన్స్ ని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్అయ్యాడు.

ఇకపోతే సినిమాకి రెండు పాత్రలే కీలకం, అవే హీరో, హీరోయిన్.. కానీ హీరో పాత్రని సరిగా డిజైన్ చేసుకోలేదు. హీరో క్యారెక్టర్ ఇది, చివరికి ఈ కారణాల వల్ల ఇలా మారాడు అని చూపిస్తాడు. కానీ ఇందులో ఆ క్లారిటీ అస్సలు లేదు. అలాగే వరుణ్ సందేశ్ సినిమాలలో అన్నిటికంటే దీనిలో నటన పరంగా చాలా తక్కువ స్కోప్ ఉన్న పాత్ర చేసాడు. ఇలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోకపోవడమే తన కెరీర్ కి చాలా మంచిది. సినిమాని చాలా సాగదీశారు. కనీసం రన్ టైం అన్నా కాస్త తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకొని ఉంటే సినిమాకి కాస్త హెల్ప్ అయ్యేది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ. ఈ మూవీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని మనం మన తాతల కాలం నుంచి చూస్తూనే ఉన్నాం.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచేవి మూడే మూడు.. అందులో ఒకటి పూర్ణ, తానై పక్కన పెడితే మిగతా రెండూ సాంకేతిక విభాగానికి చెందినవే. అవే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతను ప్రతి లొకేషన్ ని చాలా గ్రాండ్ గా చూపించాడు. ఆ విజువల్స్ కి సాయి కార్తీక్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. సాయి కార్తీక్ పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ అస్సలు బాలేదు. చాలా సీన్స్ ని కత్తిరించేయవచ్చు.

అమొఘ్ క్రియేషన్స్ వారు ఈ సినిమాకి కథని అందించారు. ఈ కథని సౌత్ కొరియాలో వచ్చిన ‘సెడ్యూస్ మిస్టర్ పర్ఫెక్ట్’ అనే సినిమా నుంచి కాపీ కొట్టారు. ఇది పక్కన పెడితే ఇలాంటి కథలు మన తెలుగులో చాలా కాలం నుంచి వస్తూనే ఉన్నాయి. కాబట్టి కథలో కొత్తదనం ఏమీ లేదు. త్రినాధరావు నక్కిన రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకి అస్సలు హెల్ప్ కాలేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సీన్స్ ని ప్రేక్షకులు ఊహించేయగలరు. ఇక దర్శకుడిగా తన మొదటి సినిమా ‘మేం వయసుకు వచ్చాం’ అంత సక్సెస్ కాలేదు. చెప్పాలంటే ఆ సినిమాలో ఉన్న మెచ్యూరిటీ కూడా ఈ సినిమాలో కనిపించలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వరుణ్ సందేశ్ కి ‘నువ్వలా నేనిలా’ కూడా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందించలేకపోయింది. అలాగే వరుణ్ సందేశ్ ని మళ్ళీ తిరిగి ఫాంలోకి తీసుకు రాలేకపోయింది. చాలా ఓల్డ్ కాన్సెప్ట్ తో బాగా బోరింగ్ గా తీసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. పూర్ణ పెర్ఫార్మన్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ తప్ప సినిమాలో చెప్పుకోదగిన అంశాలు లేవు. ఇక ఈ సినిమా చూడాలా వద్దా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి..

123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :