సమీక్ష : ఓ కల – డిస్నీ హాట్ స్టార్ లో తెలుగు సినిమా

సమీక్ష : ఓ కల – డిస్నీ హాట్ స్టార్ లో తెలుగు సినిమా

Published on Apr 17, 2023 12:21 AM IST
O Kala  Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 15, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: గౌరీష్ యేలేటి, రోష్ని సహోటా, ప్రాచీ థాకర్, దేవి ప్రసాద్ & ఇతరులు

దర్శకులు : దీపక్ కొలిపాక

నిర్మాతలు: నవ్య మహేష్ ఎం, రంజిత్ కుమార్ కొడాలి

సంగీత దర్శకులు: నీలేష్ మండలపు

సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి

ఎడిటర్: సత్య గిడుతూరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రస్తుతం మంచి కంటెంట్ ఉంటె చాలు ఆడియన్స్ చిన్న సినిమాలను సైతం ఆదరిస్తున్నారు. ఆ విధంగా పలు చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్స్ తో రిలీజ్ అయి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఆ విధంగానే మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన మూవీ ఓ కల ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. గౌరీష్ యేలేటి, రోష్ని సహోటా హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా యొక్క ఓటిటి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

హారిక (రోషిని సహూటా) ఒక ఎంబీఏ మార్కెటింగ్ గ్రాడ్యుయేట్. పలువురు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆమె ఒక సరికొత్త స్టార్టప్ కంపెనీ ని ప్రారంభిస్తుంది. అయితే కొన్ని కారణాల వలన తన కంపెనీ దివాళా తీయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తుంది. అయితే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించే సమయంలో హర్ష (గౌరీష్ యేలేటి) అనే ఒక యువకుడు ఆమె జీవితంలోకి ప్రవేశించి ఆమె మనసుని ఆ ఆలోచన నుండి తప్పిస్తాడు. మరి అంత సడన్ గా హారిక జీవితంలోకి వచ్చిన హర్ష ఎవరు, ఆమెను ఏ విధంగా అతడు ఆత్మహత్య నుండి తప్పిస్తాడు, తరువాత వారిద్దరి మధ్య ఏమి జరిగింది అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఓ కల సినిమా ప్రధానంలో సంభాషణల నేపథ్యంలో సాగుతుంది. ఇక కొత్త నటీనటులు అయినప్పటికీ కూడా ఎక్కువగా ఉన్న స్క్రీన్ స్పేస్ ని బాగా వాడుకుని హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా ఎంతో చక్కగా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి పెర్ఫార్మ్ చేసారు. బాలీవుడ్ టివి నటి అయిన రోషిని సహూటా ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి సూపర్ ఎంట్రీ ని ఇచ్చారు అనే చెప్పాలి. ఆమె అందం, అభినయంతో పాటు ప్రత్యేకంగా సీన్ కి తగిన విధంగా ఆమె పెర్ఫార్మన్స్, డైలాగ్ డెలివరీ వంటివి ఎంతో బాగున్నాయి. దీని అనంతరం నటిగా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హీరోగా నటించిన గౌరీష్ యేలేటి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు. ఎక్కడా కూడా ఓవర్ బోర్డు కాకుండా తన పాత్ర యొక్క పరిధి మేరకు అలరించారు. నేటి యువతకు ఉపయోగపడే మంచి సోషల్ మెసేజ్ ని దర్శకుడు దీపక్ కొలిపాక ఇందులో అందించారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ మెసేజ్ తాలూకు సెన్సిటివ్ సీన్స్ ని ఎంతో చక్కగా దర్శకుడు హ్యాండిల్ చేసారు. ప్రాచీ థాకర్, దేవి ప్రసాద్ కూడా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

అయితే ప్రధాన పాత్రల మధ్య సాగే సంభాషణల నేపథ్యంలో ఈ సినిమా నడవడంతో అందరు ఆడియన్స్ కి ఇది రుచించకపోవచ్చు. కేవలం కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే ఈ విధంగా సాగే కథనం నచ్చుతుంది, అలానే ఇతరులకు అది చాలా వరకు బోరింగ్ గా కూడా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా బోరింగ్ గా మరియు సాగతీతగా అనిపిస్తాయి. అలానే కొన్ని అనవసరమైన కామెడీ సీన్స్ కూడా సినిమాకి ఇబ్బంది కలిగిస్తాయి. మొదటి గంట మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేలా స్క్రిప్ట్ రాసుకుని ఉంటె బాగుండేది. అయితే దర్శకుడు ఆడియన్స్ కి ఏమి చెప్పాలి అనుకున్నది బాగున్నప్పటికీ ప్రధాన పాత్రల మధ్య మరింత ఆకట్టుకునే సన్నివేశాలు రాసుకుని ఉంటె తప్పకుండా సినిమా మరింత అద్భుతంగా ఉండేది. సినిమా రన్ టైం కూడా కొంత తగ్గించి ఉంటె బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

మ్యూజిక్ డైరెక్టర్ నీలేష్ మండలపు సంగీతం బాగానే ఉంది. అఖిల్ వల్లూరి ఫోటోగ్రఫి బాగుంది, పలు సీన్స్ విజువల్ గా ఎంతో బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ ఎడిటింగ్ విభాగం వారు మాత్రం రన్ టైం విషయంలో కొంత ట్రిమ్ చేసి ఉంటె బాగుండేది. ఇక దర్శకుడు దీపక్ కొలిపాక గురించి చెప్పాలి అంటే, మొత్తంగా ఆయన పర్వాలేదనిపించారు. అయితే నేటి సమాజానికి ఉపయోగపడే మంచి పాయింట్ ని ఎంచుకున్న ఆయనకు ముందుగా ప్రత్యేక అభినందనలు అందించాలి. సెకండ్ హాఫ్ లో మంచి ట్విస్ట్ లు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ ని మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటె బాగుండేదనిపిస్తుంది. అయినప్పటికీ మంచి మెసేజ్ అయితే అందించారు.

 

తీర్పు :

మొత్తంగా ఓ కల మూవీ మెల్లగా సాగే సోషల్ మెసేజ్ కలిగిన డ్రామా మూవీ. తొలి సినిమా అయినప్పటికీ కూడా గౌరీష్, రోషిని ఇద్దరూ కూడా తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయి నటించారు. అలానే దర్శకుడు కొన్ని కీలక సీన్స్ ని ఎంతో బాగా హ్యాండిల్ చేసారు. అయితే పైన చెప్పిన విధంగా కథనాన్ని ముందుకు నడిపే విధానం మాత్రం మెల్లగా ఉంటుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు