సమీక్ష :”పెదకాపు 1″- అక్కడక్కడా ఆకట్టుకునే విలేజ్ డ్రామా

Peddha Kapu 1 Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 29, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నరేన్, నాగ బాబు, అనసూయ, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, బ్రిగడ సాగ

దర్శకుడు : శ్రీకాంత్ అడ్డాల

నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి

సంగీతం: మిక్కీ జె. మేయర్

సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు

ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్

సంబంధిత లింక్స్: ట్రైలర్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో లేటెస్ట్ గా తీసిన ఓ ఇంట్రెస్టింగ్ చిత్రమే “పెదకాపు”. సినిమా టైటిల్ అనౌన్సమెంట్ తోనే మంచి బజ్ ని అందుకున్న ఈ చిత్రంతో కొత్త హీరో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అయ్యాడు. మరి ఈ చిత్రం అంచనాలు అందుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథ లోకి వస్తే..ఈ చిత్రం 1980వ దశకంలో ప్లాన్ చేయగా ఓ ప్రాంతంలో రెండు గ్యాంగ్ లు సత్య రంగయ్య(రావు రమేష్) అలాగే భైయన్నా (నరేన్) అధికార ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా ఈ ముఠాల నడుమ ఆ పవర్ పాలిటిక్స్ నడుమ అణచివేతలు జరుగుతున్నా సమయంలో ఓ సామాన్యుడు పెదకాపు(విరాట్ కర్ణ) పాత్ర ఏంటి? అప్పటికే స్టేట్ లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెడుతున్న సమయం కూడా అదే కావడం ఈ రసవత్తర పరిస్థితులు అన్నీ పెదకాపుని ఎక్కడికి తీసుకెళ్లాయి? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

మొదటిగా ఈ చిత్రంలో కనిపించే నేపథ్యం ఆసక్తిగా ఉంటుంది. నిజానికి శ్రీకాంత్ అడ్డాల నుంచి ఇలాంటి తరహా ఒక సాలిడ్ సబ్జెక్టు ని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. ఆ రేంజ్ లో సినిమాలో కొన్ని సీన్స్ ఇంటెన్స్ గా ఉంటాయి. అలాగే అలాగే యంగ్ హీరో విరాట్ కర్ణ సాలిడ్ పెర్ఫామెన్స్ ని డెలివర్ చేసాడు. అలాగే తన పాత్ర ఎంత ఛాలెంజింగ్ గా ఉన్నప్పటికీ దానిని తన మొదటి సినిమా అయినా కూడా చాల మెచ్యూర్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు.

అలాగే అనసూయ, రావు రమేష్, ప్రగతి శ్రీవాస్తవ లాంటి నటులు కూడా ఎవరికి వారే ఇంప్రెసివ్ పెర్ఫామెన్స్ ని అందించారు. అలాగే సినిమాలో సెకండాఫ్ మరో ప్రధాన బలం అని చెప్పాలి. ఇందులో కనిపించే డీటెయిల్స్ కానీ ట్విస్ట్ లు కానీ చాలా బాగున్నాయి. అలాగే వెర్సటైల్ నటుడు రావు రమేష్ మరియు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ అంటేనే ఒక మార్క్ ఉంది. ఇపుడు ఇది అంతకు మించి అయితే ఉంటుంది.

రావు రమేష్ కి రాసిన డైలాగ్స్ తన పాత్ర తీర్చిద్దిడం వంటివి కూడా హైలైట్ అని చెప్పాలి. అలాగే నటి అనసూయపై అందించిన చిన్న మెసేజ్ కూడా ఉంది. అంతే కాకండా అనసూయ సాలిడ్ పెర్ఫామెన్స్ కూడా కనబరిచింది. వీటి అన్నిటితో పాటుగా సినిమాలో హైలైట్ గా చోటా కె నాయుడు చూపించిన విజువల్స్ సినిమా నేపథ్యానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి చాలా నాచురల్ విజువల్స్ తో ఆడియెన్స్ కి మంచి ట్రీట్ అందించాయి అని చెప్పాలి. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం కూడా అదనపు ఆకర్షణగా నిలిచింది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కొన్ని అంశాలు చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా కనిపిస్తాయి. దీనితో ఈ చిత్రంలో ఈ అంశమే ఒకింత మైనస్ అని చెప్పాలి. దర్శకుడు అన్ని విషయాల్లో చాలా క్లియర్ గా ఉన్నాడు కానీ మొత్తం ఫస్టాఫ్ ని ఈ సినిమా మొదటి సగం అంతా కూడా పాత్రలు పరిచయం చేయడానికే సరిపోయింది. దీనితో కథనం కాస్త స్లో గా ఉంటుంది. అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.

దీనితో ఇది అందరికీ కనెక్ట్ అవ్వడం కష్టం. అలాగే ఈ చిత్రంలో కొంచెం మనకి ఆల్రెడీ చూసిన సినిమాలు రంగస్థలం, దసరా, రక్త చరిత్ర లాంటివి కూడా మనకి గుర్తు రావచ్చు. అలాగే సినిమాలో వైలెన్స్ కూడా చాలా డిస్టబింగ్ గా అనిపించవచ్చు. అలాగే సినిమాలో కొన్ని అంశాలు కాస్త రిపీటెడ్ గా వచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే ఇంకా కొన్ని సీక్వెన్స్ లు డైలాగ్స్ ని బెటర్ గా డిజైన్ చేయాల్సింది.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో ‘అఖండ’ నిర్మాతలు పెట్టిన ఎఫర్ట్స్ బాగున్నాయి. అలాగే సినిమా థీమ్ కి తగ్గట్టుగా డిజైన్ చేసిన సెట్ వర్క్స్ అంతా కూడా చాలా నీట్ గా ఉన్నాయి. నిర్మాణాలు విలువలు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇక టెక్నీకల్ టీం లో అయితే పైన ఆల్రెడీ చెప్పినట్టుగా సంగీతం అందించిన మిక్కీ జె మేయర్ చోటా కె ప్రసాద్ సినిమాటోగ్రఫీలు సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాయి. అలాగే డైలాగ్స్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ యత్నం కాస్త రిపీటెడ్ గా స్లో గా కొన్ని చోట్ల అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా మాత్రం మన ఒక సరికొత్త శ్రీకాంత్ అడ్డాల సినిమాని చూడొచ్చు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “పెదకాపు 1” ఇంటెన్స్ ఎమోషన్స్ అండ్ ఎంగేజింగ్ సీన్స్ తో ఆకట్టుకునే లానే ఉంటుంది. మెయిన్ గా హీరో విరాట్ కర్ణ చాలా మంచి డెబ్యూ అందుకున్నాడు దానిని తన నటనతో కూడా ఇంప్రెస్ చేసాడు. అలాగే సినిమాలో కనిపించే ఇతర ప్రధాన పాత్రధారులు అంతా కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు. కొంచెం స్లో నరేషన్ అక్కడక్కగా కొన్ని డిస్టబింగ్ సీన్స్ వంటివి అందరికీ ఈ సినిమా కనెక్ట్ కాకపోవచ్చు. పక్కన పెడితే ఈ చిత్రం ఈ వారాంతానికి ఒకసారికి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :