సమీక్ష : ‘పెంగ్విన్’ – అక్కడక్కడా పర్వాలేదనిపించే సస్పెన్స్ థ్రిల్లర్ !

సమీక్ష : ‘పెంగ్విన్’ – అక్కడక్కడా పర్వాలేదనిపించే సస్పెన్స్ థ్రిల్లర్ !

Published on Jun 20, 2020 3:05 AM IST
penguin Review

Release date : June 19th, 2020

123telugu.com Rating : 2.75/5

తారాగణం : కీర్తి సురేష్, లింగా,

రచన&దర్శకత్వం : ఈశ్వ‌ర్ కార్తీక్

నిర్మాత : కార్తీక్ సుబ్బ‌రాజు

సంగీతం : సంతోష్ నారాయణన్

మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన చిత్రం ‘పెంగ్విన్’. ఈశ్వ‌ర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకం పై ద‌ర్శ‌కుడు, నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్‌’లో ఈ రోజు విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథ :

ఏడు నెలలు గర్భవతి అయిన రిథమ్ (కీర్తి సురేష్) ఎంతో కష్టపడి మిస్ అయిపోయిన తన కొడుకు (అజయ్)ను వెతికి పట్టుకునే క్రమంలో పడిన మానసిక సంఘర్షణ, ఆ వెతుకులాటలో ఆమె ఎదురుకునే ఆవేదన మరియు బాధతో సాగే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా. అయితే అసలు రిథమ్ కొడుకునే ఎందుకు కిడ్నాప్ చేశారు ? ఆ చేసిన వ్యక్తి చార్లీ చాప్లిన్ గెటప్ లో ఎందుకు ఉన్నారు ? ఈ మధ్యలో కొడుకు మిస్ అవ్వడంతో రిథమ్ మొదటి భర్తతో విడిపోవాల్సి రావడం, రెండో భర్త ద్వారా మళ్ళీ ఆమె తల్లి కాబోతుండటం ? చివరికీ రెండో బిడ్డ కూడా ప్రమాదంలో పడటం ? ఈ నాటకీయ పరిణామాల్లోనే ఆమె కిడ్నాపర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? ఈ మొత్తం క్రమంలో ఆమె తన ఇద్దరి బిడ్డలను ఎలా కాపాడుకున్నది అన్నదే మిగత కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర రిథమ్ (కీర్తి సురేష్) పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘పెంగ్విన్’ ఇంట్రస్ట్ గానే సాగింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నుండి సస్పెన్స్ సీన్స్ అండ్ ఎమోషన్స్ ట్రీట్మెంట్ లో బాగా రాసుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మెయిన్ గా కొడుకు మిస్ అయ్యాక వెతికే సన్నివేశాల్లో మరియు డాక్టర్ సీక్వెన్స్ లో ఆమె నటన.. అలాగే ఆమె పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి.

న్యూ యాంగిల్ లో ఓ తల్లి పాయింట్ అఫ్ వ్యూలో ఈశ్వ‌ర్ కార్తీక్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తీసుకొవడం… దాన్ని స్క్రీన్ మీద ఇంట్రస్టింగ్ గా మలచడంలో ఈశ్వ‌ర్ కార్తీక్ దర్శకత్వ పనితనం బాగుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన చిత్రంగా ఈ సినిమాని మలిచారు. లోన్లీగా ఫీల్ అయ్యే ప్ర‌తి తల్లికి ఈ మూవీ కాన్సెప్ట్ క‌నెక్ట్ అవుతుంది. ఇక మొదటి భర్తగా నటించిన నటుడు లింగ, అలాగే భావన పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. డైరెక్టర్ షాట్ మేకింగ్ అండ్ అతని విజన్ చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చెయ్యకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. కొన్ని సన్నివేశాల్లో మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరోయిన్ కి ఇచ్చిన లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.

అయితే ఈశ్వ‌ర్ కార్తీక్ దరకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటీ… అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు మరియ క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ విభిన్నంగా ఉండటంతో.. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు. దానికి తోడూ మొదటి భాగం కథనంలో ప్లో అర్ధం కాకుండా ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతోంది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ.. సినిమా విజువల్ గా పూర్తిగా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం పర్వాలేదు. అయితే సీన్ మూడ్ తో పాటు ఓవరాల్ సినిమాని దృష్టిలో పెట్టుకుని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్లాష్ బ్యాక్ కి లైవ్ కి మధ్య స్మూత్ కట్టింగ్ తో సినిమాని చక్కగా ఎడిట్ చేశారు. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

వైవిధ్యమైన కంటెంట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్ మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా బోర్ గా సాగడం, కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం లాంటివి సినిమాకి డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి. మొత్తం మీద ఈ ‘చిత్రం’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ముందు చెప్పుకున్నట్లు.. కమర్షియల్ చిత్రాలకు మాత్రమే కట్టుపడ్డ రెగ్యులర్ సినిమాల మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ ను ఈ సినిమా మెప్పించదు.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు