సమీక్ష : పవర్ ప్లే – అక్కడక్కడా ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్

సమీక్ష : పవర్ ప్లే – అక్కడక్కడా ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్

Published on Mar 6, 2021 9:05 AM IST
 Power Play movie review

విడుదల తేదీ : మార్చి 05, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : రాజ్ తరుణ్, పూర్ణ, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌ త‌దిత‌రులు.

దర్శకత్వం : విజ‌య్ కుమార్ కొండా

నిర్మాత‌లు : మ‌హిద‌ర్‌, దేవేష్

సంగీతం : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ : ఐ. ఆండ్రూ

ఎడిటింగ్ : ప‌్ర‌వీణ్ పూడి

హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ చిత్రం ప్రేక్షుకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

 

రాజ్ తరుణ్ (విజయ్) తాను ప్రేమించిన కీర్తి (హేమల్ ఇంగ్లే)ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. దాంతో అతని ఫ్యామిలీ, కీర్తి ఫ్యామిలీని కూడా పెళ్లికి ఒప్పిస్తారు. విజయ్ కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తోందని పెళ్లికి ఒప్పుకుంటాడు కీర్తి తండ్రి. కానీ ఈ మధ్యలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం విజయ్ పై దొంగ నోటుల కేసు బుక్ అవుతుంది. దాంతో అతని జీవితం తలక్రిందుల అవుతుంది. అసలు విజయ్ ను ఈ కేసులో ఎవరు ఇరికించారు ? ఈ కేసు నుండి బయట పడటానికి విజయ్ ఎలాంటి ప్రయత్నాలు చేసాడు ? చివరకు ఈ కేసుకి కాబోయే సీఎం అభ్యర్థి పూర్ణ(బుజ్జమ్మ)కి సంబంధం ఏమిటి ? ఈ మధ్యలో విజయ్ లవ్ స్టోరీలో వచ్చిన సమస్యలు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో హీరోగా నటించిన రాజ్ తరుణ్ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్నిఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన హేమల్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. విలన్ గా నటించిన అజయ్ ఎప్పటిలాగే తన గంబీరమైన నటనతో ఆకట్టుకున్నాడు.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర విజయ్ (రాజ్ తరుణ్) పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి ఈ సినిమా ఎక్కడా సాగతీయకుండా స్పీడ్ గా సాగింది. ఇక సెకెండ్ హాఫ్ లో వచ్చే సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

అలాగే ఈ సినిమాలోనే కీలక పాత్రలో నటించిన హీరోయిన్ పూర్ణ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. హీరో పై దొంగ నోట్లు ఆరోపణల ట్రాక్ లో ఎక్కడా లాజిక్ లేదు. పైగా ఆ ట్రాక్ మీదే మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది.

దానికితోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు మెయిన్ గా సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా సినిమా రిజల్ట్ ను ఎఫెక్ట్ చేసింది.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక దర్శకుడు కొండా విజయ్ కుమార్ మంచి కథాంశం తీసుకున్నా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు.

 

తీర్పు :

 

‘పవర్ ప్లే’ అంటూ వచ్చిన ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఫ్యూ ఎమోషనల్ సీన్స్ తో పర్వాలేదనిపిస్తోంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. అయితే, ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు