సమీక్ష : రాహు – పూర్తిస్థాయిలో మెప్పించని క్రైమ్ లవ్ డ్రామా

Raahu movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు :  కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులు

దర్శకత్వం : సుబ్బు వేదుల

నిర్మాత‌లు : ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల

సంగీతం :  ప్రవీణ్ లక్కరాజు

సినిమాటోగ్రఫర్ : ఈశ్వర్ యల్లు మహాంతి,సురేష్ రగుతు

ఎడిటర్ : అమర్ రెడ్డి


కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రాహు’. కాగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

కథ :

ఆరేళ్ళ వయసులో తల్లిని కోల్పోయి బాధలో ఉన్న బాను(కృతి గార్గ్)కి చిన్నతనంలోనే కన్వర్షన్ డిజార్డర్ కూడా వస్తోంది. అంటే రక్తం చూస్తే ఆమెకు కళ్ళు కనిపించవు. అయితే ఆమెలో ఆమె తండ్రి పోలీస్ కమీషనర్ (సుబ్బు వేదుల) ధైర్యం నింపే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కమీషనర్ క్రిమినల్ నాగరాజు (కాలకేయ ప్రభాకర్) ను అరెస్ట్ చేస్తాడు. దాంతో నాగరాజు ఎలాగైనా భానును చంపుతానని శపథం చేస్తాడు. అలా పదేళ్లు గడిచాక పెరిగి పెద్ద అయిన భాను, శేష్ (అభిరామ్ వర్మ,)తో ప్రేమలో పడుతుంది. వాళ్ళ ప్రేమను భాను తండ్రి అంగీకరించినప్పటికీ, వారి పెళ్లికి ఒక సమస్య వస్తోంది. అలాగే భానును ఎవరో కిడ్నాప్ చేయించి చంపుదామని ప్రయత్నం చేస్తారు? ఆ క్రమంలో నాగాజు (కాలకేయ ప్రభాకర్) భానుకి ఎలాంటి సాయం చేశాడు ? అసలు భాను పెళ్లికి వచ్చిన సమస్య ఏమిటి ? ఇంతకీ భానుని చంపుదామనుకుంటున్న వ్యక్తి ఎవరు ? భాను తనకి జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది ? చివరికి తనను తాను ఎలా కాపాడుకుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కృతి గార్గ్ కెరియర్ బిగినింగ్ లోనే ఇలాంటి పాత్ర చేసి మెప్పించడం అంటే అది కచ్చితంగా ఆమె టాలెంటే. భాను పాత్రను ఆమె చాల బాగా పోషించింది. తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో కీలక సన్నివేశాల్లో మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కృతి నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక శేష్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన అభిరామ్ వర్మ తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ప్లేలోని ఇంట్రస్ట్ ను తన క్యారెక్టరైజేషన్ తో మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.

అలాగే కీలక పాత్రల్లో నటించిన కాలకేయ ప్రభాకర్, సత్యం రాజేష్ కూడా ఎప్పటిలాగే చాల బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక దర్శకుడు ఈ చిత్రాన్ని సెకెండ్ హాఫ్ లో ఉత్కంఠను పెంచుతూ.. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని ముగించడం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సుబ్బు కొన్ని సన్నివేశాల్లో చాల డిటైయిల్డ్ గా పనిచేశారు. కానీ, అంతే డిటైయిల్డ్ గా స్క్రిప్ట్ లో కూడా పనిచేసి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరోలా ఉండేది. అయితే సినిమా చూసాక డైరెక్టర్ సుబ్బువేదుల కొన్ని సీన్స్ లో ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ లా అనిపించినా.. అలాగే ఆయన రాసుకున్న సబ్జెక్ట్ ను కొన్ని సన్నివేశాలు మినహా స్క్రీన్ మీద బాగానే ప్రెజెంట్ చేసినా… ఈ సబ్జెక్ట్ ఎంతమందికి కనెక్ట్ అవుతుంది ? ఏ వర్గం ప్రేక్షుకులు ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తారు ? లాంటి బేసిక్ క్వశ్చన్స్ ను ఎనాలసీస్ చేసుకోని దానికి తగ్గట్లు సినిమా తీయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. మంచి కంటెంట్ తో సినిమా తీయడం వేరు, సినిమాలో ఉన్న కంటెంట్ తోనే అడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడం వేరు. ఈ సినిమా కంటెంట్ పరంగా ఏ మాత్రం తీసిపోదు, అయితే ఆ కంటెంట్ ను ఎలివేట్ రాసుకున్న ట్రీట్మెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకోదు.

దర్శకుడు స్క్రిప్ట్ లో తన పాయింటాఫ్ వ్యూ తప్పా మిగిలిన దృక్పథాలను పెద్దగా పట్టించుకోలేదు అనుకుంటా. లేకపోతే ఫస్ట్ హాఫ్ అంతా అలా పేలవంగా తయారయ్యి ఉండేది కాదు. దీనికి తోడు కథ కథనాలు మరీ సీరియస్ గా సాగడం.. కొన్ని సన్నివేశాలు మరి కొంత తికమకగా అనిపించడం, అక్కడక్కడ కొన్ని సీన్స్ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించింది.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ ఆయింది. మెయిన్ గా సిధ్ శ్రీరామ్ పాడిన ‘ఏమో ఏమో సాంగ్’ చాల బాగుంది. ఆలాగే ఆ పాట పిక్చరైజేషన్ కూడా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.

ఇక దర్శకుడు సుబ్బు మంచి కథాంశం తీసుకున్నా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు. కొన్ని సన్నివేశాలు బాగా బోర్ సాగుతాయి.

 

తీర్పు :

‘రాహు’ అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు ఫ్యూ ఎమోషనల్ సీన్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం :