సమీక్ష : రెడ్ – స్లోగా సాగే సస్పెన్స్ డ్రామా !

సమీక్ష : రెడ్ – స్లోగా సాగే సస్పెన్స్ డ్రామా !

Published on Jan 15, 2021 3:04 AM IST
RED movie review

విడుదల తేదీ : జనవరి 14, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : రామ్ పోతినేని, మాల్వికా శర్మ, అమృత అయ్యర్, నివేదా పెతురాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, హెబా పటేల్, సోనియా అగర్వాల్

దర్శకత్వం : కిషోర్ తిరుమల

నిర్మాత‌లు : స్రవంతి రవికిషోర్

సంగీతం : మణి శర్మ

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

ఎడిట‌ర్‌ : జునైద్ సిద్దిఖీ

 

‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అందుకున్న తరువాత రామ్, ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

 

కథ:

 

ఈ రెడ్ కథలో రామ్ ఆదిత్య అండ్ సిద్ధార్థ్ గా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. సిద్ధార్థ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కాగా, ఆదిత్య ఒక దొంగ. అయితే, ఒక రోజు, ఆకాష్ అనే వ్యక్తి చంపబడతాడు. ఆ హత్య చేసింది, సిద్ధార్థ్ నే చెప్పి అతన్ని అరెస్టు చేస్తారు. కానీ, ఆదిత్య కూడా ఇదే కేసులో చిక్కుకున్నప్పుడు కథలోని అసలు పాయింట్ అండ్ ట్విస్ట్ తలెత్తుతుంది. ఇంతకీ, ఆకాష్‌ను ఎవరు చంపారు? అసలు ఆ హత్య వెనుక అలాగే కథలోని అసలు చిక్కు ముడి వెనుక మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? అది కథను ఎలా ముందుకు నడిపింది ? చివరకు ఆదిత్య అండ్ సిద్ధార్థ్ ఆ హత్య కేసు నుండి ఎలా బయటపడతారు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

సినిమాకు ప్రధానంగా ఆదిత్య, సిద్ధార్థ్ రెండు పాత్రలు మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. పైగా ఆ రెండు పాత్రల్లో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమా అంత రెండు పాత్రల మధ్య వెరీయేషన్స్ చూపిస్తూ చాలా సెట్టిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రలలోని వైవిధ్యాలను రామ్, ప్రతి సీన్ లోనూ చక్కగా ప్రదర్శించిన విధానం మాత్రం మొత్తం సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోంది

ఇక హీరోయిన్ మాలవికా శర్మ సినిమాలో అందంగా కనిపిస్తోంది. కాని ఈ చిత్రంలో ఆమెకు పెద్దగా స్కోప్ అండ్ స్క్రీన్ స్పెస్ కూడా లేదు. ఇక వెన్నెలా కిషోర్ కొన్ని సన్నివేశాల్లో కామెడీని పండించాడు. అలాగే హాస్యనటుడు సత్య తన పాత్రలో కూడా మంచి ఫన్ ను జనరేట్ చేశాడు. పోసాని అలాగే మిగిలిన నటీనటులు బాగానే నటించారు. ఇక ఈ చిత్రంలో పోలీసుల సెటప్ అండ్ సీన్స్ కూడా బాగున్నాయి.

ఇంటర్వెల్ బ్లాక్, దర్యాప్తులో వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక నివేదా పెతురాజ్ తన పాత్రలో ఓకే అనిపించింది. డైరెక్టర్ డైరెక్షన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ ను ఎమోషన్స్ తో డీల్ చేసిన విధానం బాగుంది. ఆయన రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో పెద్ద లోపం ఏమిటంటే, ఈ చిత్రం ఆకర్షణీయమైన ట్రీట్మెంట్ లేకపోవడం. ప్రొసీడింగ్స్‌పై పట్టు లేనందున మొదటి సన్నివేశం నుండే ఈ చిత్రం నిస్తేజంగానే సాగుతోంది. పైగా నివేదా పాత్ర బలహీనంగా ఉన్నందున దర్యాప్తు సీన్స్ కూడా సిల్లీగా అనిపిస్తాయి. దాంతో ఈ సినిమా ఎటువంటి ప్రభావాన్ని సృష్టించదు.

ఇది కాకుండా, సినిమా ప్లే కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. అసలు మెయిన్ కథ విరామం సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. హీరోకి స్నేహితురాలను పోలీసులు తమ దర్యాప్తులో ఆమెను విస్మరిస్తారు. ఇలా లాజిక్ లేకుండా సాగింది ఇన్విస్టిగేషన్. అలాగే, హీరోకు నివేదా ఎందుకు సహాయం చేస్తుందో కూడా స్పష్టత లేదు. ఇలాంటి లాజిక్స్ లేనివి చాలా ఉన్నాయి. దీనికితోడు సినిమా వ్యవధి కూడా చాలా పొడవుగా ఉంది. చాలా సీన్స్ లో మీకు విసుగు తెప్పిస్తుంది.

 

సాంకేతిక విభాగం :

 

కెప్టెన్ అఫ్ ది షిప్ అయినా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి సరైన అవుట్ ఫుట్ ను ఇవ్వలేకపోయాడు. ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఇక ఆకట్టుకునే మ్యూజిక్ ఈచిత్రంలో ఉంది. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ బాగుంది. ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే సినిమాలో సంభాషణలు ఆకట్టుకుంటాయి మరియు ఈ చిత్రం సెటప్ కూడా బాగుంది. అయితే దర్యాప్తుకు ప్రాధాన్యత లేనందు వల్ల సినిమాలో ఇంట్రస్ట్ మిస్ అయింది.

 

తీర్పు :

 

మొత్తం మీద, ఈ రెడ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్, కథలోని మెయిన్ పాయింట్ బాగుంది. అయితే, కొత్త పాయింట్‌ తో వైవిద్యభరితమైన చిత్రంగా వచ్చినప్పటికీ ఈ సినిమా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రామ్ రెండు పాత్రలు, ఆ పాత్రల చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే హత్యకు సంబంధించిన సీన్స్ మరియు కొన్ని సెంటిమెంట్ మూమెంట్స్ బాగున్నా.. కథాకథనాలు ఆసక్తికరంగా లేకపోవడం, యాక్షన్ సీన్స్ ఇంట్రస్ట్ గా సాగకపోవడం, అలాగే కథకు అవసరం లేని అనవసరమైన సన్నివేశాలు ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. కాకపోతే రామ్ ఫ్యాన్స్ కు సినిమాలోని రామ్ నటన మరియు కొన్ని అంశాలు నచ్చుతాయి.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు