సమీక్ష : కుల్ఫీ – ఇంకాస్త స్వీట్ గా ఉంటే బాగుండేది.!

విడుదల తేదీ : 4 జూలై 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : శ్రవణ రాజన్
నిర్మాత దయానిధి అళగిరి
సంగీతం : యువన్ శంకర్ రాజా
నటీనటులు :  జై, స్వాతి, అర్ జే బాలాజీ

మన తెలుగు ప్రేక్షకులు తమిళ్ సినిమాలను కూడా బాగా ఆదరించడంతో ప్రతివారం ఏదో ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా విడుదల అవుతూనే ఉంది. అలా ఈ వారం మన ముందుకు వచ్చిన సినిమా కుల్ఫీ. ‘జర్నీ’ ఫేం జై, తెలుగమ్మాయి స్వాతి హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ ని శ్రావణ రాజన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ సెక్స్ బాంబు సన్నీ లీయాన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

హరీష్ (జై), మెడికల్ రేప్రసేంటేటివ్ గా పనిచేస్తున్న ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. తనకు మంచి ఫోన్ కొనడానికి కూడా డబ్బులు లేనందున ఒక పాత డొక్కు సెల్ ఫోన్ వాడుతుంటాడు. అయితే ఈ ఫోన్ తో తనకు ఎక్కడికి వెళ్ళిన అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అందరూ హరీష్ ని వింతగా చూస్తుంటారు. మంచి ఫోన్ ఉంటేనే అమ్మాయిలు చూస్తారని బలవంతం పెట్టడంతో ఒక ఫోన్ కొనడానికి సిద్దం అవుతాడు.

అయితే అనుకోకుండా ఒక రోజు హరీష్ కి ఐ ఫోన్ దొరుకుతుంది. స్నేహితులు ప్రోత్సహించడంతో ఆ ఫోన్ ని అతనే వాడుతుంటాడు. ఈ క్రమంలోనే అతనికి స్వాతి (స్వాతి)తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారుతుంది. నిజాయితి ఆటో డ్రైవర్ అయిన తన అన్న చెప్పడంతో హరీష్ ఆ ఐ ఫోన్ ని తిరిగి ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడే అతనికి కొత్త కష్టాలు ఎదురవుతాయి, తనకు తన కుటుంబానికి ఆపద ఎదురవుతుంది. అసలు ఆ ఫోన్ వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ ఆపదల నుండి హరీష్ ఎలా బయట పడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే…

ప్లస్ పాయింట్స్ :

‘జర్నీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన జై, ఒక్కో సినిమాతో తన నటనలో అభివృద్ధి కనబరుస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మంచి హావభావలతో తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. కామెడీ, ఎమోషనల్ ఇలా అన్ని సన్నివేశాలలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇక తెలుగమ్మాయి స్వాతి విషయానికి వస్తే, మంచి క్యూట్ బబ్లీ లుక్స్ తో, తనకు ఉన్నదీ చిన్న పాత్రే అయినప్పటికీ దానికి పూర్తి న్యాయం చేసింది.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో ఫ్రెండ్ గా నటించిన అర్ జే బాలాజీ గురించి. తన కామెడీ టైమింగ్ తో సినిమాకు కావాల్సిన వినోదాన్ని అందించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ బాగుంది. హీరో డబ్బా ఫోన్ తో ఎదురయ్యే ఇబ్బందులు ప్రేక్షకులకి కావలసినంత వినోదాన్ని ఇస్తాయి. సెకండ్ హాఫ్ లో హీరో పాడైపోయిన మందులను అమ్మే ముఠాను పట్టుకోడానికి చేసే ప్రయత్నం, దానికి సంబంధించిన సన్నివేశాలను బాగా తీశారు.

మైనస్ పాయింట్స్ :

హీరో హీరోయిన్ లు తప్ప మీగతా నటులు ఎవ్వరూ అంత తెలిసిన వారు కాకపోవడం సినిమా పెద్ద మైనస్. ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ గా అనిపించినప్పటికీ మంచి ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు మాత్రం లేవు. సినిమా ఫస్ట్ హాఫ్, రెగ్యులర్ సన్నివేశాలతో కాస్త స్లోగా అనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ లో వేగం పుంజుకున్నప్పటికీ అనవసరంగా పెట్టిన ఒక పాట ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది.

సినిమాలో సస్పెన్స్ రీవీల్ అయిపోయాక అన్ని ఉహించదగిన సన్నివేశాలే వస్తుంటాయి. విలన్ పాత్ర పోషించిన నటుడి ఎక్స్ ప్రేషన్స్ పేలవంగా ఉన్నాయి. సినిమాలో సన్నీ లీయాన్ ఉందని, ఆమె అందచందాలను చూడాలని వెళ్ళే ప్రేక్షకుడు నిరుత్సాహపడక తప్పదు. సినిమా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా లేకపోవడం కూడా సినిమాకు పెద్ద మైనస్.

సాంకేతిక విభాగం:

సినిమా సినిమాటోగ్రఫి పర్వాలేదు అనిపించేలా ఉంటుంది. అద్భుతంగా ఉన్నాయి అనే సన్నివేశాలు సినిమాలో ఏమి లేవు. సినిమాలో పాటలు ఏదో పర్వాలేదు అనే లాగా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సినిమా ఆఖరి 30 నిమిషాలపై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది.

ఇక డైరెక్టర్ శ్రవణ రాజన్, ఇతనికి ఇది తొలి సినిమా. తొలి సినిమా అయినప్పటికీ మంచి స్టొరీ లైన్ తో మంచి ప్రయత్నం చేసాడు. స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నాడు కానీ సన్నివేశాల పరంగా పెద్దగా ఆసక్తి కలిగించదు. అధ్బుతంగా తీసాడు అని కాకుండా పర్వాలేదు అని అనిపించుకున్నాడు.

తీర్పు :

పెద్ద ఫోన్ కావాలి అని అనుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే కాన్సెప్ట్ చుట్టూ ఒక కథని రాసుకుని శ్రవణ రాజన్ తొలి ప్రయత్నంగా తీసిన ఈ ‘కుల్ఫీ’ సినిమాలో కామెడీ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాల బాగున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా మంచి కామెడీ థ్రిల్లర్ చూడాలనుకునే వారు ఈ ‘కుల్ఫీ’ ని ఒక్కసారి టేస్ట్ చేయోచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

More