సమీక్ష : నిరంతరం నీ ఊహలే – సినిమా చూస్తే పీడ కలలే

విడుదల తేదీ: 24 ఆగష్టు 2012
123 తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : ఎల్ రెడ్ కుమార్
నిర్మాత : జయరామన్, ఎల్ రెడ్ కుమార్
సంగీతం: జి.వి ప్రకాష్ కుమార్
నటీనటులు : అధర్వ, అమలా పాల్


తమిళనాడులో ఫిబ్రవరిలో ‘ముప్పోజుదుం ఉన్ కర్పనైగల్’ అనే ఒక తమిళ సినిమా విడుదలైంది. అక్కడి ప్రేక్షకులే ఆ సినిమాని తిప్పి కొడితే మళ్లీ ఆ సినిమాని తెలుగులో మన మీద ప్రయోగంలాగా వదిలారు. మొదట ‘నిరంతరం నీ ఊహలో’ అని ప్రకటించి ఆ తరువాత ‘నిరంతరం నీ ఊహలే ‘ అని మార్చి ఈ రోజే విడుదల చేసారు. అధర్వ, అమలా పాల్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాని ఎల్ రెడ్ కుమార్ డైరెక్ట్ చేసారు. మన తెలుగు ప్రేక్షకుల మీద వదిలిన ఈ ప్రయోగం ఫలిచిందా? లేక విష ప్రయోగంలాగా వికటించిందా ఇప్పుడు చూద్దాం.

కథ :

రామ్ (అధర్వ) హైదరాబాదులో జాబ్ రావడంతో తన తల్లిని ఒంటరిగా వదిలి వెళ్తాడు. రామ్ వర్క్ నచ్చి అతడు పని చేసే కంపెనీ అతనిని ప్రాజెక్ట్ వర్క్ కోసం బెంగుళూరుకు పంపిస్తుంది. అక్కడ చారులత (అమలా పాల్) తో కలిసి ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభిస్తాడు. కొడుకు దూరం కావడంతో రామ్ తల్లి మనో వ్యాధితో మరణిస్తుంది. తల్లి మరణంతో మనో వేదనకు గురైన రామ్ ని చారులత ఓదారుస్తుంది. చారులతని ప్రేమించిన రామ్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిన తరువాత తన ప్రేమను ఆమెను చెప్పాలనుకుంటాడు. అదే సమయంలో అనుకోని సంఘటనల వల్ల చారులత, రామ్ కి దూరమవుతుంది. ఆ తరువాత వారిద్దరు కలిసారా లేదా అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

‘మైనా’ సినిమా తరువాత అమలా పాల్ యాక్టింగ్ మీద కంటె స్కిన్ షో మీద ఇంట్రస్ట్ పెడుతుంది. యాక్టింగ్ పరంగా పాస్ మార్కులే దక్కించుకున్న ఆమె గ్లామర్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అమలా పాల్ పాత్రకి చిన్మయి డబ్బింగ్ బాగా కుదిరింది. హీరోకి తల్లిగా నటించిన అనుపమ కుమార్ కూడా బాగానే చేసింది. సినిమా ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అన్నట్లు సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండటం కొంచెం ఊరట కలిగించే విషయం. ఒకపరి, కన్నీరైనా పాటలు బావున్నాయి. ఇంతకు మించి ఈ సినిమాలో ప్లస్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు.

మైనస్ పాయింట్స్ :

సూట్ బావుంది కదా అని మనకు సూట్ కాకపోయినా వేసుకుంటే చండాలంగా ఉంటుంది. కథలో హీరో పాత్ర వెరైటీగా ఉంటుంది, నాలుగు ఫైట్లు, ఒక పాటలో మొత్తం మీరు గాల్లోనే ఉంటారు అనగానే హీరో గారు వెంటనే ఒప్పుకున్నారేమో. సదరు హీరో అధర్వ గారు సీనియర్ హీరో మురళి కొడుకు. యాక్టింగ్లో ఓనమాల వరకే నేర్పించి అతన్ని మన మీదకి వదిలారు. అయన ఇచ్చిన హావభావాలకి మనకి పీడకలలు రావడం ఖాయం. డైరెక్టర్ ఎల్ రెడ్ కుమార్ ఈ కథని ఏదో ఇంగ్లీష్ సినిమా నుండి ఇన్స్పైర్ అయినట్లుగా స్పష్టంగా అర్ధమవుతుంది. ఫస్టాఫ్ సోసోగా సాగినా సెకండాఫ్ పైత్యం అంతా చూపించారు. వీటికి తోడు సంతానం కామెడీ స్పెషల్ టార్చర్.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ శక్తి అందించిన సినిమాటోగ్రఫీ. సినిమా అంతా రిచ్ గా చూపించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో ఒకపరి, కన్నీరైనా పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ వరకు బాగా అందించాడు. డబ్బింగ్ సినిమా కాబట్టి డైలాగ్స్ మీద కేర్ తీస్కోలేదు. ఫైట్స్ అన్ని గాల్లోనే ఉన్నాయి.

తీర్పు :

ఈ సంవత్సరం విడుదలైన ఒక్క డబ్బింగ్ సినిమా కూడా తెలుగులో హిట్ కాలేదు. నిరంతరం నీ ఊహలే కూడా అదే రికార్డు కంటిన్యూ చేసింది. ఈ సినిమా చూసాక కనీసం నిర్మాతలకు డబ్బింగ్, పబ్లిసిటీ ఖర్చులు అయినా వస్తాయా అనే అనుమానం వస్తుంది. ఇంత చెప్పినా కూడా ఈ సినిమా చూడాల్సిందే అనుకుంటే ఎలాగూ సాటిలైట్ రైట్స్ అమ్మేసి ఉంటారు కదా నెక్స్ట్ మంత్ టీవీలో వేస్తారు అక్కడ చూస్కోండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5


అశోక్ రెడ్డి. ఎమ్

Click Here For ‘Niratharam Nee Oohale’ English Review

సంబంధిత సమాచారం :