సమీక్ష : రొమాంటిక్ – ఆకట్టుకొనే రొమాంటిక్ ప్రేమ కథ

సమీక్ష : రొమాంటిక్ – ఆకట్టుకొనే రొమాంటిక్ ప్రేమ కథ

Published on Oct 30, 2021 10:00 AM IST
Romantic Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణ, ఉత్తేజ్, సునయన, రమా ప్రభ తదితరులు

దర్శకుడు: అనీల్ పాదురి

నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి

సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫీ: నరేష్ రానా

ఎడిటర్: జునైడ్ సిద్దికి


2 సంవత్సరాలు గా నిర్మాణం లో ఉన్న పూరి జగన్నాథ్ మరియు ఛార్మి ల యొక్క తాజా ప్రొడక్షన్ రొమాంటిక్ చిత్రం ఎట్టకేలకు మంచి బజ్ మధ్యన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కి ఇది హీరోగా మూడవ సినిమా. ఇన్ స్టాగ్రామ్ బ్యూటీ కేతిక శర్మ ఈ చిత్రం తో తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తుంది.

కథ:

గోవా డ్రగ్ మాఫియా నేపథ్యం లో ఈ రొమాంటిక్ చిత్రం కథ ఉంటుంది. వాస్కో డ గామా (ఆకాష్ పూరి) ఈ చిత్రం లో ఒక స్ట్రీట్ రఫియాన్. డబ్బు సంపాదించడానికి మరియు తన బామ్మ (రమప్రభ) కలను నెరవేర్చడానికి నేరాలను ఎంచుకుంటాడు. అతను మరియు అతని చిన్ననాటి ఫ్రెండ్ అన్నీ గోవా లోని అత్యంత ప్రసిద్ద డ్రగ్ మాఫియా లార్డ్ రోడ్రిగా ముఠా లో చేరడం జరుగుతుంది. కొద్ది కాలం లోనే వాస్కో గోవా అండర్ వరల్డ్ లో కి కింగ్ లా మారిపోతాడు. మోనికా (కేతిక శర్మ) అనే యువ సంగీత విద్వాంసురాలు అందాలకు పడిపోతాడు.

ఒక డ్రగ్ డీల్ విఫలం అయిన తరువాత, వాస్కో రొడ్రిగ్స్ ను చంపుతాడు. అంతేకాక తనకి తాను గా మాఫియా కి రాజు గా ప్రకటించుకుంటాడు. ఈ ప్రక్రియ లో ఆకాష్ ఒక ఎస్ఐ ను చంపుతాడు. ఇదే సమయం లో ఒక క్రూరమైన ఎసిపి రమ్య (రమ్య కృష్ణ) వాస్కో ను పట్టుకోవడానికి ముంబై నుండి గోవా కి బదిలీ చేయడం జరుగుతుంది. రమ్య కృష్ణ తను అనుకున్న పనిని సాధిస్తుందా? వాస్కో మరియు మోనికా ల రిలేషన్ షిప్ ఏమవుతుంది? మిగతా విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఆకాష్ మునుపటి చిత్రాలు ఆంధ్రా పోరి, మెహబూబా చిత్రాలతో పోల్చితే చాలా మెరుగు పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. అతని కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డైలాగ్ డెలివరీ మెయిన్ హైలెట్ అని చెప్పాలి. చాలా కీలక సన్నివేశాల్లో ఆకాష్ సినిమా ను భుజానికి ఎత్తుకున్నారు. ఢిల్లీ భామ కేతిక శర్మ తన అందం తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటుంది అని చెప్పాలి. ఆమె నటన చాలా డీసెంట్ గా ఉందని చెప్పాలి. ఇది ఆమె తొలిచిత్రం.

ఈ చిత్రంలో రమ్య కృష్ణ సిన్సియర్ పోలీస్ పాత్రలో నటించి కీ రోల్ ప్లే చేశారు. రమ్య వాయిస్ ఓవర్ తో ఈ చిత్రం కథ సరిగ్గా వివరించ బడింది అని చెప్పాలి. సినిమా క్లైమాక్స్ చాలా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూసిన అనంతరం ప్రేక్షకులు మంచి అనుభూతితో బయటికి వస్తారు. వాస్కో మరియు మోనికాల మధ్య ప్రేమను బాగా చూపించడం జరిగింది. హీరో రామ్ పోతినేని ఉస్తాద్ అవతార్ లో ఒక ప్రత్యేక పాటలో మాస్ గా కనిపించడం జరిగింది.

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ చూస్తే, ఈ చిత్రానికి రొమాంటిక్ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది అసలు అర్దం కాదు. రెండవ భాగం స్టార్ట్ అయిన 15 నిమిషాల వరకు కూడా ఈ చిత్రంలో యాక్షన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అంతగా రొమాంటిక్ గా ఉండదు అని చెప్పాలి.

అంతేకాక ఆకాష్ తన వయసుకి తగ్గ పాత్రలో నటిస్తున్నారు. అతను పాత్ర ఇందులో పైకి ఎదగడంలో చాలా సిల్లీగా మరియు చాలా సింపుల్‌గా ఉంటుంది. హీరో హీరోయిన్ బ్యాక్ అందంపై మోజు పడటం అనేది కాస్త చీప్‌గా అనిపిస్తుంది. పూరీ జగన్నాథ్ సినిమాల్లో అలాంటి పాత్రలు సర్వ సాధారణం అని చెప్పాలి. హీరోయిన్‌పై హీరోకి ఉన్న కోరిక మరియు అతని వైపు ఆమె ముందుకు వెళ్లడం అనేది నమ్మే విధంగా అనిపించదు.

సాంకేతిక విభాగం:

రొమాంటిక్ కథ మీకు పోకిరి, షారుక్ ఖాన్ రాయీస్, పూరి జగన్నాథ్ 143 వంటి చిత్రాల భావాన్ని అందిస్తుంది. కథ అంత కొత్తగా ఏమీ ఉండదు, ప్రధాన పాత్రల పై సినిమా ఆధారపడి ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్, స్టోరీ సెటప్, మేకింగ్ మరియు డైలాగ్స్ అన్నీ కూడా పూరి మార్క్ తో ఉన్నాయి. దర్శకుడు అనిల్ పాడురీ మంచి చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు అని చెప్పాలి. నటీనటులను మంచిగా హ్యాండిల్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే స్క్రిప్ట్ అనవసరం గా మరియు మామూలుగా ఉంటుంది.

మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ రొమాంటిక్ చిత్రం కి మెయిన్ పిల్లర్లలో ఒకరు అని చెప్పాలి. ఈ చిత్రం లో మంచి పాటల తో పాటుగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఎడిటింగ్ బావుంది, సినిమాటోగ్రఫి కూడా పర్వాలేదు అని చెప్పాలి. సుందరమైన గోవా బీచ్ లు మరియు కొన్ని ప్రదేశాలు బాగా చిత్రీకరించబడ్డాయి. నిర్మాణ విలువలు కథకు, స్థాయికి తగిన విధంగా ఉన్నాయి.

తీర్పు:

మొత్తం మీద రొమాంటిక్ చిత్రం ఒక ఆకర్షణీయమైన డ్రామా అని చెప్పాలి. ఈ సినిమాపై పూరి జగన్నాథ్ మార్క్ కనబడింది. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ అసాధారణ ప్రేమకథకి ఆకాష్ పూరి ఆత్మ విశ్వాసం మరియు కేతిక శర్మ గ్లామర్ తో పాటుగా, సునీల్ కశ్యప్ పాటలు సినిమాకు మెయిన్ హైలెట్. ఈ వారాంతం ఈ రొమాంటిక్ సినిమా మంచి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పాలి. అయితే మరీ ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమాను ఎంజాయ్ చేస్తారు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు