సమీక్ష : సారొచ్చారు – క్లీన్ ఫ్యామిలీ సినిమా

సమీక్ష : సారొచ్చారు – క్లీన్ ఫ్యామిలీ సినిమా

Published on Dec 21, 2012 8:00 PM IST
Sarocharu విడుదల తేదీ: 21 డిసెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : పరుశురాం
నిర్మాత : ప్రియాంక దత్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు : రవితేజ, కాజల్, రిచా

రవితేజ ఈ సంవత్సరంలో ఇప్పటికే మూడు సినిమాలు ఇచ్చి నాలుగో సినిమా ‘సారొచ్చారు’ అంటూ రెడీ అయ్యాడు. రవితేజ, పరుశురాం ‘ఆంజనేయులు’ కాంబినేషన్ రిపీట్ చేస్తూ మళ్లీ సారొచ్చారు అంటూ వచ్చారు. రవితేజ సారుకి జోడీగా కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ నటించారు. వైజయంతి బ్యానర్లో అశ్విని దత్ సమర్పించిన సారొచ్చారు సినిమాని ప్రియాంక దత్ నిర్మించారు. సారు ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారో ఒకసారి చూద్దాం.

కథ :

కార్తీక్ (రవితేజ) ఇటలీలో జాబ్ చేస్తుంటాడు. ఫ్రెండ్స్ ఎవ్వరు ప్రేమించుకున్నా అందరినీ ఎదిరించి పెళ్లి చేస్తుంటాడు. ఇలా ఒక జంటని కలపడం చూసిన సంధ్య (కాజల్) కార్తీక్ ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కార్తీక్ మొదట్లో సంధ్యని అవాయిడ్ చేస్తుంటాడు. అయినా పట్టువిడవకుండా సంధ్య ప్రేమిస్తూనే ఉంటుంది. సంధ్య భాధ భరించలేని కార్తీక్ తనకి ఇప్పటికే పెళ్లయింది అని చెప్తాడు. సంధ్యకి తన గతం చెప్పడం మొదలుపెడతాడు. కార్తీక్ ఫుట్ బాల్ కోచ్ గా పనిచేస్తున్న సమయంలో వసు (రిచా) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఏమైంది? సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకున్న సంధ్య బావ గౌతమ్ (నారా రోహిత్) ఏమయ్యాడు? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే సారొచ్చారు సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

రవితేజ రెగ్యులర్ స్టైల్ మార్చి ఈ సినిమాలో కొత్తగా ట్రై చేసాడు. మాస్ మహారాజాని క్లాస్ మహారాజాగా చూపించే ప్రయత్నం చేసారు. కాజల్ అగర్వాల్ కొత్తగా చేసిందేమీ లేదు రొటీన్. ఇలాంటి పాత్రలు ఆమె ఎన్నో చేసింది. కొంచెం మగరాయుడి లాంటి పాత్ర. కొన్ని సీన్స్ వరకు బాగానే చేసింది. రిచా గంగోపాధ్యాయ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సినిమాకి ఆమె పాత్ర కీలకం. ఉన్నంతలో బాగానే చేసింది. నారా రోహిత్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడు. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో బాగా చేసాడు. కొన్ని సన్నివేశాల్లో కామెడీ కూడా బాగానే పండించాడు. ప్లాటినం ప్రనీత్ గా ఎం.ఎస్ నారాయణ బాగా నవ్వించాడు. ఇంటర్వెల్ కి ముందు 30 నిముషాలు స్టొరీ లోకి బాగానే మేనేజ్ చేసాడు. ఇంటర్వెల్ తరువాత 30 నిముషాలు కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా చూపించాడు. పెళ్ళి తరువాత ఆడవాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు.

మైనస్ పాయింట్స్ :

రవితేజలో కిక్ ఎనర్జీ ఈ సినిమాలో అస్సలు కనిపించదు. రవితేజ నుండి కోరుకునేది అదే కాబట్టి అది ఆశించిన వారికి మాత్రం నిరాశ తప్పదు. రిచా ఎపిసోడ్ కూడా అంత బాగా చూపించి అంతా తూచ్ అనడం కూడా కొందరికి నచ్చకపోవచ్చు. సినిమా మొదలైన మొదటి 45 నిమిషాల వరకు చాలా నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా కన్విన్సింగ్ గా లేదు. తన స్నేహితుడు కథ అని చెప్పి చివర్లో తనని ఫుట్ బాల్ కోచ్ గా చూపించారు. మెడ్ ఫర్ ఈచ్ అధర్, జగజగ జగదేక వీర పాటల్లో కొరియోగ్రఫీ అస్సలు బాగాలేదు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు డీల్ చేయడంలో దర్శకుడు ఫీల్ మిస్ చేసాడు.

సాంకేతిక విభాగం :

విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మేజర్ అసెట్. ఇటలీలో తీసిన సన్నివేశాలన్నీ చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ మాత్రం చాలా నీరసంగా ఉంది. పరుశురాం సగం వరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. తనకు బాగా వచ్చిన డైలాగుల వరకు బాగానే రాసుకున్నాడు కానీ టైమింగ్ సరిగా లేక వాటిలో చాలా వరకు పేలలేదు. ఫైట్స్ అయితే సినిమాలో టైం వేస్ట్.

తీర్పు :

సారొచ్చారు క్లీన్ ఫ్యామిలీ సినిమా. రవితేజ నుండి కిక్ కోరుకునే వారు నిరాశ పడతారు కానీ పరుశురాం చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం అభినందనీయం. పెళ్ళికి ముందు ప్రేమ ఇంపార్టెంట్ కాదు పెళ్లి తరువాత ప్రేమ ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నం చేసాడు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

అశోక్ రెడ్డి .ఎమ్

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు