సమీక్ష : “శ్యామ్ సింగ రాయ్” – ఎమోషనల్ గా సాగే పిరియాడికల్ డ్రామా!

సమీక్ష : “శ్యామ్ సింగ రాయ్” – ఎమోషనల్ గా సాగే పిరియాడికల్ డ్రామా!

Published on Dec 25, 2021 3:07 AM IST
Shyam Singha Roy Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 24, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ తదితరులు

దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్

నిర్మాత: వెంకట్ బోయనపల్లి

సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్

ఎడిటర్ : నవీన్ నూలి

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. మరి ఈ రోజు విడుదల అయిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

 

వాసుదేవ్ (నాని) ఒక అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే క్రమంలో కీర్తి (కృతి శెట్టి)ని చూసి ఆమె వెంటపడి తన షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి ఒప్పిస్తాడు. ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత సినిమా తీసి నేషనల్ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే తన సినిమా కథను శ్యామ్ సింగరాయ్ బుక్ నుంచి కాపీ కొట్టాడని వాసుదేవ్ ని అరెస్ట్ చేస్తారు. అసలు శ్యామ్ సింగరాయ్ (నాని) ఎవరు ? రోజీ (సాయి పల్లవి) కి శ్యామ్ కి ఉన్న సంబంధం ఏమిటి ? వాసుదేవ్ తనకు తెలియకుండానే శ్యామ్ సింగరాయ్ కథను ఎలా కాపీ కొట్టాడు ? ఇంతకీ శ్యామ్ సింగరాయ్ కి – వాసుదేవ్ కి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

నాని.. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు గెటప్స్ లో చక్కగా నటించి నాని మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో నాని చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు.

ఇక హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి తన హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ మరియు తన నాట్యంతోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా తన నటనతో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని యాక్షన్ సీక్వెన్స్ స్ బాగున్నాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మరియు శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

శ్యామ్ సింగరాయ్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డైజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. అలాగే 1975 కాలంలో జాతీయ స్థాయిలో గొప్పగా ప్రభావితం చేసిన ఓ గొప్ప రచయిత ఫోటోను ఏ పత్రిక ప్రచురించలేదు కాబట్టి.. అతను ఎలా ఉంటాడో ఇప్పటి తరానికి ఎవరికి తెలియదు అని మాటలతో సరిపెట్టడం లాజికల్ కరెక్ట్ గా అనిపించదు.

అయితే, రాసుకున్న కథను తెర పై చాలా క్లారిటీగా చాలా కలర్ ఫుల్ గా మేకింగ్ చేసిన దర్శకుడు రాహుల్, ప్లేను మాత్రం చాలా స్లోగా నడిపాడు. కాకపోతే సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగాయి. అలాగే సినిమా కళాత్మకంగా ఉండటం కారణంగా పక్కా మాస్ ఆడియన్స్ ను ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవచ్చు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ విభాగానికి వస్తే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా గుడిలో స్వామీజీని చంపే సీక్వెన్స్ లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దర్శకుడు రాహుల్ డైరెక్షన్ పరంగా బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతగా వెంకట్ బోయినపల్లి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘శ్యామ్ సింగరాయ్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో నాని నటన, సాయి పల్లవి డ్యాన్స్, కృతి గ్లామర్ సినిమాలో హైలైట్ నిలిచాయి. సినిమా కూడా కళాత్మకంగా ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. అయితే స్క్రీన్ ప్లే లో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, పునర్జన్మకు సంబంధించిన థీమ్ తీసుకుని, మంచి ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్నారు. అలాగే విప్లవం అంటూ తిరిగే వ్యక్తి కుటుంబం ఎదుర్కొనే సమస్యల తాలూకు పర్యవసానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక నాని – సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తమ్మీద ఈ చిత్రం మెప్పిస్తోంది.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు